CM Revanth : ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు చాన్స్ ఇవ్వొద్దు.. కేసీఆర్ పై రేవంత్ కీలక నిర్ణయం

CM Revanth

CM Revanth

CM Revanth : తెలంగాణలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి దాదాపు ఆరు నెలలు అవుతోంది. ఇప్పటికే రేవంత్ హయాంలో అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యాయి. త్వరలో మరో సారి అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. ఈ సారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరై సింహగర్జన చేస్తారని, రేవంత్ సర్కార్ కు సభలో చుక్కలు చూపిస్తారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చడంలో వైఫల్యం చెందిందని, కేసీఆర్ వాగ్ధాటితో సభలో వార్ వన్ సైడ్ ఉంటుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నాయి. అదే సమయంలో వాళ్లకు చెక్ పెట్టేలా సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో తమ ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు వివరించేలా ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించినట్టు సమాచారం.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలైన హామీలు, పెండింగ్ హామీల అమలుకు జరుగుతోన్న కసరత్తును ప్రజలకు వివరించి.. బీఆర్ఎస్ , బీజేపీల నోర్లు మూయించాలని రేవంత్ ఫిక్స్ అయినట్లు సమాచారం. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చింది.. వాటిని ఎలా నిర్లక్ష్యం చేసింది.? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వెంటనే హామీలకు శ్రీకారం చుట్టిన విధానంపై ప్రజల్లో చర్చ జరిగేలా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం  తీసుకున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు వంద రోజుల్లో అమలైన ఐదు గ్యారంటీలతో ప్రజలకు కలిగిన మేలును రిపోర్ట్ రూపంలో జనాల ముందుంచాలని రేవంత్ ఫిక్స్ అయ్యారట. ఈమేరకు గత అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ వైఫల్యాలు, అవినీతి, అక్రమాలను శ్వేతపత్రం పేరిట రిలీజ్ చేశారో.. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వైఫల్యాలను పోల్చుతూ.. కాంగ్రెస్ పాలనను గురించి ప్రజల్లోకి తీసుకెళ్లేలా శ్వేత పత్రం విడుదల చేసే అవకాశం ఉంది. పైగా, ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు అవుతారని బీఆర్ఎస్ చెబుతోంది. కేసీఆర్‎కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బీఆర్ఎస్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేసే ప్రణాళికలో భాగంగా రేవంత్ ఆరు నెలల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్ ను ముందుంచనున్నట్లు సమాచారం.

TAGS