CBI : సీఎం జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దు – కోర్టుకు సీబీఐ విజ్ఞప్తి
CBI : విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతు సడలించాలని ఏపీ సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై బుధవారం విచారణ జరిపిన సీబీఐ న్యాయస్థానం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ గురువారం కోర్టులో తమ వాదనలు వినిపించింది.
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోరింది. అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతున్న దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఇప్పటికే ఓసారి ఆయన విదేశాలకు వెళ్లొచ్చారని గుర్తుచేసింది. వాదనలు విన్న సీబీఐ న్యాయస్థానం విచారణను మే 14కు వాయిదా వేసింది.
కాగా, సీఎం జగన్ కోర్టు అనుమతి వస్తే ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటన చేయాలని భావిస్తున్నారు. బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.