JAISW News Telugu

Bihar government : టీషర్టులు, జీన్స్ తో పాఠశాలలకు రావొద్దు.. టీచర్లకు బీహార్ ప్రభుత్వం ఆదేశం

Bihar government

Bihar government

Bihar government : ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ఉపాధ్యాయులలాగానే ఉండాలి. అంతేకానీ ఫ్యాషన్ షోలో ఉన్నట్లు ఉండకూడదు, అందుకే ప్రభుత్వ టీచర్లు ఎవరూ టీ షర్టులు, జీన్స్ ప్యాంట్స్ వేసుకొని పాఠశాలలకు రావద్దని బీహార్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ అంటే పద్ధతి లేకుండా పోతుందని, టీచర్లు పద్ధతిగా లేకపోతే ఇక పిల్లలు ఎలా తయారవుతారో ఊహించుకోండి అంటూ బీహార్ ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది.

అన్ని విద్యాసంస్థల్లోనూ టీచర్లు పద్ధతిగా దుస్తులు ధరించాలని ప్రభుత్వం సూచించింది. అంతేగాకుండా రీల్స్, షార్ట్స్ చేయడాన్ని సైతం నిషేధించింది. డాన్సరులు చేయడం, డీజేలు చేస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయటం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులపై చులకన భావం ఏర్పడుతుందని, ఇలాంటి వ్యవహారాలను సహించేది లేదని బీహార్ ప్రభుత్వం హెచ్చరించింది.

ప్రభుత్వ టీచర్ల ఇలాంటి వ్యవహారాలు విద్య వ్యవస్థపైనే ప్రతికూల ప్రభావం చూపిస్తాయని, ప్రభుత్వ స్కూల్స్ గౌరవాన్ని తగ్గిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇక నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు అందరూ.. విధులకు హాజరయ్యే సమయంలో టీ షర్టులు, జీన్స్ ప్యాంట్స్ ధరించకూడదని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పద్ధతిగా రెగ్యులర్ దుస్తులు ధరించాలని కూడా ప్రభుత్వం సూచించింది.

Exit mobile version