Junior NTR : ఇన్నాళ్లు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి వంశం మధ్య పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఇంతకాలం అందరు కలిసే ఉన్నా గత కొంత కాలంగా వారి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇటీవల ఎన్టీఆర్ ఫ్లెక్సీలు బాలయ్య తొలగించడంతో వారి మధ్య అగాధం మరింత పెరిగింది. వీరి మధ్య ఏం గొడవలు జరిగాయో కానీ విభేదాలు
వచ్చాయో తెలియదు కానీ రెండు వర్గాలుగా మారిపోయారు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఒక గ్రూపుగా మరో గ్రూపులో బాలయ్య ఉన్నారు. దీంతో నందమూరి అభిమానులు ఇక మీదట ఎన్టీఆర్ సినిమాలు చూడరనే అంటున్నారు. దీంతో రాబోయే దేవర సినిమా నందమూరి అభిమానులు చూస్తారా? లేదా అనేది తెలియడం లేదు. మొత్తానికి నందమూరి వంశంలో కూడా రెండు వర్గాలు కావడం గమనార్హం.
చంద్రబాబును అసెంబ్లీలో అవమానించినప్పుడు, ఆయనను అరెస్టు చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించలేదు. కనీసం మీడియా వేదికగా కూడా స్పందించలేదు. దీంతో ఎన్టీఆర్ పై కోపం పెరిగిపోయింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ అంటే అటు బాబుకు ఇటు బాలయ్యకు ఆగ్రహం కలిగింది. సొంత వాడై ఉండి కూడా కనీసం పరామర్శించలేదనే అక్కసు పెరిగింది.
ఆ దూరం అలాగే పెరిగింది. ప్రస్తుతం రెండు వర్గాలుగా చేసింది. ఈ నేపథ్యంలో బాలయ్య వర్సెస్ ఎన్టీఆర్ అన్నట్లుగా మారింది. ఈ క్రమంలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగించడంతో వారి మధ్య ఎడబాటు మరింత ఎక్కువయిందనే వాదనలు బలంగా వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ అభిమానులు, బాలయ్య అభిమానులు రెండు వర్గాలుగా వీడి తమ హీరోలను ఫోకస్ చేసే అవకాశం ఏర్పడింది.