Diwali Celebrations : శాక్రమెంటోలోని రాంచో కార్డోవా నగరంలో దీపావళి వేడుకలు
Diwali Celebrations : సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అండ్ ఓవర్సీస్ వలంటీర్స్ ఫర్ ఏ బెటర్ ఇండియా (OVBI) ఆధ్వర్యంలో నవంబర్ 5, 2023న దీపావళి వేడుకలు నిర్వహించింది. ‘ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ పేరిట సంబురాలు కొనసాగాయి. కాలిఫోర్నియా స్టేట్, శాక్రమెంటో సమీపంలో రాంచో కార్డోవా నగరంలో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు 2000 మందికి పైగా ప్రవాస భారతీయులు (NRI) హాజరయ్యారు. రాంచో కార్డోవా సిటీ కౌన్సిల్ సభ్యులు సిరి పులిపాటి, గారెట్ గేట్‌వుడ్ ఈ వేడుకలకు వీచ్చేశారు. వారి ప్రసంగాలు ప్రవాసులను ఆకట్టుకున్నాయి.
దీపావళి వేడుకలను పురస్కరించుకొని ప్రత్యేక బాణసంచా కాల్చారు. రాత్రి సమయంలో ఆకాశం కాంతి మయంగా మారింది. సంస్కృతి ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. గోంగూర బృందం, మిస్టర్ అభినవ్ ఆధ్వర్యంలో ప్రదర్శనలు కొనసాగాయి. కుండలతో ప్రదర్శించిన భరత నాట్యం ఆకట్టుకుంది. లైట్ ఆఫ్ డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో కథక్ ప్రదర్శన కూడా ఆకట్టుకుంది. అనుప్రియ, యంగ్ అండ్ వైబ్రెంట్ ఎమ్మెల్సీలు, అభిగ్న్య, నమిత్‌కు అభినందనలు తెలిపారు.
ఈవెంట్ ను పురస్కరించుకొని ఫొటో బూత్ నిర్వహించారు. ఈవెంట్ కు సంబంధించి జ్ఞాపకాలను నెమరువేసుకునేందుకు ప్రతీ ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. చిన్నారుల కోసం కార్నివాల్‌ని ఏర్పాటు చేశారు. తర్వాత అందరికీ విందు ఏర్పాటు చేశారు. స్వీట్లు, రుచికరమైన వంటకాలను వడ్డించారు. రిలయన్స్ సూపర్‌మార్ట్, బేకీ బైట్స్ స్వీట్లను స్పాన్సర్ చేశాయి.
మెహిందీ పోటీలు నిర్వహించారు. యువతులు ఎక్కువ సంఖ్యలో దీనిలో పాల్గొన్నారు.
సువిధ ఇంటర్నేషనల్ ఫౌండర్, ప్రెసిడెంట్ భాస్కర్ వెంపటి, శోభారావు, వందన శర్మ, వేణు ఆచార్యతో సహా లీడ్ ఆర్గనైజర్లు రాంచో కార్డోవా నగరానికి, రాంచో కార్డోవా పార్క్ డిపార్ట్‌మెంట్ నగరానికి, గౌరవనీయులైన హాజరైన వారికి, స్పాన్సర్‌లకు, ప్రతిభావంతులైన ప్రదర్శనకారులకు మరియు అంకితభావంతో కూడిన వలంటీర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్
సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (https://suvidhainternational.