Aishwarya Rai Divorce : కారణం ఏదైనా కావచ్చు రంగుల ప్రపంచంలో విడాకులు కామన్ గా మారిపోయాయి. కొందరికి తక్కువ కాలం.. మరికొందరికి ఎక్కువ కాలం కావచ్చు.. కానీ విడాకులు మాత్రం తప్పనిసరిగా మారాయి. లవ్ మ్యారేజ్ అంటూ చై-సామ్ విషయంలో వారి అభిమానులు సంబురపడ్డారు. కానీ వారిని తక్కువ సమయంలోనే నిరాశకు గురి చేశారు. ఇక కోలివుడ్ నుంచి పరిశీలిస్తే ధనుష్-ఐశ్వర్య కూడా విడిపోయారు. ఇప్పుడు ఇలాంటిదే బాలీవుడ్ లో జరిగేలా కనిపిస్తుంది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ అభిషేక్ బచ్చన్ విడిపోతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
ఐశ్వర్య వివాహానికి ముందు సల్మాన్ ఖాన్ తో లవ్ ట్రాక్ నడిపిందని బాలీవుడ్ సర్కిల్ లో తీవ్ర చర్చ జరిగింది. ఇవన్నీ ఫేక్ అని బచ్చన్ బాబు అభిషేక్ ను వివాహం చేసుకొని సంచలనం సృష్టించింది. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాలు చేస్తూ.. బిజీగానే ఉండేది. ఇది ఇలా ఉంటే.. ఐశ్వర్య రాయ్-అభిషేక్ బచ్చన్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, వీరు త్వరలోనే విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రాచారం జోరుగా సాగుతోంది.
గతంలో కూడా రెండు సార్లు ఇలాంటి పుకార్లు వచ్చాయి. మొదటి సారి వచ్చిన కొద్ది రోజులకు తన కూతురు ఆరాధ్య స్కూల్ ఈవెంట్ లో ఇద్దరూ కలిసి పాల్గొనడంతో కామెంట్లకు బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత అభిషేక్ తన పెళ్లి ఉంగరం పెట్టుకోలేదని మరో సారి రూమర్లు వచ్చాయి. ఆ సమయంలో వారిద్దరూ కలిసి ప్రో కబడ్డీలో కనిపించి రూమర్లకు చెక్ పెట్టారు. మళ్లీ ఇప్పుడు కూడా మరో సారి రూమర్లు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ సారి కారణం ఏంటంటే అభిషేక్ బచ్చన్ తన ఇన్ స్టాలో ఒక లైఫ్ ఫెల్యూర్ పోస్ట్ చేశాడు. అభిషేక్ అలా పోస్ట్ చేయడంతో విడాకులపై హింట్ ఇచ్చాడని అంతా అనుకుంటున్నారు.
అసలు ఆ పోస్ట్ లో ఏం ఉందంటే ‘పరాజయ భయం కలలను నాశనం చేస్తుంది. కానీ ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే కలలు నిజమవుతాయి’ అని రాసుకువచ్చాడు. దీంతో ఈ జంట విడాకుల వార్తలు మళ్లీ బాలీవుడ్ సర్కిల్ లో వైరల్ అయ్యాయి. పెళ్లియిన 17 ఏళ్లకు ఈ జంట విడిపోతుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇందులో నిజమెంత అనేది తెలియదు, కానీ ఈ న్యూస్ తెలుసుకున్న ఐశ్వర్య, అభిషేక్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు.