Divorce : పెళ్లయిన దశాబ్దాల తర్వాత కూడా విడాకులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు?

Divorce

Divorce

Divorce : భారతదేశం వివాహ బంధాన్ని పవిత్రమైనది భావిస్తుంది. అయితే ఆధునిక కాలంలో పెరుగుతున్న సంక్లిష్టతలు ఆ బంధాన్ని బలహీన పర్చడంతో పాటు నెక్ట్స్ జనరేషన్ కు వివాహంపై అభిప్రాయాలను మారుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా భారత్ లో డైవర్స్ రేషియో 1.1 శాతంగా ఉందని ఐక్య రాజ్యసమితి ఒకింత సంతోషం వ్యక్తం చేసింది.

కానీ, ఇటీవల ఆ రేటు వేగంగా మారుతుంది. ప్రాశ్చాత్య దేశాల్లోలాగా విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. పెళ్లియిన కొత్తలో అంటే కొంచెం వరకు ఓకే అనుకోవచ్చు. కానీ దశాబ్దం పాటు కాపురం చేసి కూడా విడాకులు వెళ్లడం నిజంగా కలవరపాటుకు గురి చేయడమే. దీనికి గల కారణాలపై ఒక ఇంగ్లిష్ పేపర్ అధ్యయనం చేసింది అది అందించిన సమాచారం ప్రకారం..

  • దశాబ్ధాల తర్వాత కూడా విడాకులకు దారితీసే అంశాలు

– మారుతున్న కుటుంబ పరిస్థితులు
భారత్ ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పుట్టినిల్లు. ప్రాశ్చాత్య దేశాల్లో టీనేజ్ వచ్చిన తర్వాత తన సంపాదన, లివింగ్, మ్యారేజ్ విషయంలో వారికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. కానీ భారత్ లో అలాకాదు. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన వారు మరో ఉమ్మడి కుటుంబం నుంచి పిల్లను తెచ్చుకోవడం, ఇచ్చుకోవడం చేస్తున్నారు.

ఉమ్మడి కుటుంబాల ద్వారా ఆర్థిక భారం అందరిపై సమానంగా పడేది. దీనికి తోడు కొత్త జంటలు వైవాహిక జీవితంలో ఇమిడేందుకు మంచి వాతావరణం ఉండేది. వారి మధ్య ఏమైనా మనస్పర్థలు వస్తే కుటుంబం మొత్తం కలిసి పరిష్కరించేవారు. కానీ అది మారిపోయింది. ఇప్పుడు పెళ్లియి కాళ్ల పారాని ఆరకముందే వేరు కాపురం అంటూ రెడీ అయిపోతున్నారు. వారి మధ్య అంతరాలు పుట్టుకస్తున్నాయి. ఆర్థికంగా ఇద్దరూ ఫిట్ గా ఉండడం కూడా ఒక వైనస్సే అవుతుంది. వ్యక్తిగత అవసరాలు, ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఎవరికి వారు విడిపోవాలని నిర్ణయించుకుంటున్నారు.

అవిశ్వాసం
దీర్ఘకాలిక వివాహాల్లో అవిశ్వాసం విడాకులకు కారణం కావచ్చు. నేటి ఇంటర్ కనెక్టెడ్ ప్రపంచంలో ఉన్న కనెక్షన్, టెంప్ట్ టేసన్ కు ఉన్న ఎక్కువ అవకాశాలు కారణం కావచ్చు.

మారుతున్న వైఖరి
ఒకప్పుడు వంటింటికే అంకితమైన భారత స్త్రీలు ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుతున్నారు. ఇది కూడా లాంగ్ టర్మ్ మ్యారేజెస్ బ్రేక్ అయ్యేందుకు ముఖ్యమైన కారణంగా నిలుస్తోంది. సామాజిక వైఖరులు కూడా విడాకులను మరింత సామాజికంగా ఆమోదయోగ్యంగా మారుస్తున్నాయి.

TAGS