JAISW News Telugu

Divi Vadthya : తెల్ల చీరలో బీచ్ లో అందాలు పరిచిన దివి..

FacebookXLinkedinWhatsapp
Divi Vadthya

Divi Vadthya

Divi Vadthya : నటి దివి వడ్త్యా బిగ్ బాస్ తో తెలుగులో విపరీతంగా ఫేమ్ అయ్యింది. బిగ్ బాస్ తర్వాత సినిమాల్లో ఆమెకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి. దివి ఇటీవల మహేశ్ బాబు ‘మహర్షి’, చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ లో కనిపించింది.

దివి అందానికి మారుపేరు. లంబసింగిలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఇంతలో, దివి తాను బీచ్‌లో ఉన్న చిత్రాలను సోషల్ మీడియాలోని ఇన్ స్టా ద్వారా పోస్ట్ చేసింది.

తడి చీరలో ఫోజులు ఇచ్చి ఫొటోషూట్‌లో అద్భుతంగా కనిపించింది. బికినీలు మరియు స్విమ్‌సూట్లలో అద్భుతంగా మహిళల బీచ్‌సైడ్ చిత్రాలు పోస్ట్ చేస్తుండగా.. దివి వడ్త్యా మాత్రం చీరలోనూ అందంను చూపించవచ్చని బీచ్ లో చీర కట్టుతో మెరిపించింది.

దివి సముద్రపు నీటితో ఆడుతూ.. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది. ఫుల్ జోష్ లో, ఎనర్జిటిక్ లుక్ తో ఖుషీ చేసింది. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సూపర్ అంటూ లవ్ సింబల్స్ పోస్ట్ చేస్తున్నారు. కొందరు బ్యూటిఫుల్ లుక్స్ అంటూ ప్రశంసిస్తున్నారు. దేవుడు తయారుచేసిన అందగత్తెల్లో దివికి ఒక ప్లేస్ ఉందని కామెంట్లు పెడుతున్నారు.  

15 మార్చి, 1996లో హైదరాబాద్ లో దివి జన్మించింది దివి. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో పదో తరగతి వరకు చదివింది. జీ నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది. సినిమాలపై మక్కువతో 2017లో మోడలింగ్ తో కెరీర్ ప్రారంభించింది. 2018లో ‘లెట్స్ గో’ అనే షార్ట్ ఫిలింలో నటించింది. 2019లో ‘మహర్షి’ ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2019లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, 2021లో ‘క్యాబ్‌ స్టోరీస్‌’ చిత్రాలు చేసింది. ‘సిలక ముక్కుదానా’ అనే మ్యూజిక్ వీడియోను 2021లో విడుదల చేసింది.

Exit mobile version