YS Jagan : దివాకరం ది క్యాషియర్.. జగన్ కు దిమ్మదిరిగే కౌంటర్
YS Jagan : దివాకం ది క్యాషియర్ అనే షార్ట్ ఫిల్మ్ తో మొత్తం ఏపీ సీఎం జగన్ పథకాలతో చేస్తున్న మోసం బయటపెట్టేశారు. ఓ గ్రామస్థుడు బ్యాంకుకు వెళ్లి క్యాషియర్ ఫ్రీగా డబ్బులు పంచుతున్నాడని గ్రామస్థులందరికీ చెబుతాడు. దీంతో గ్రామంలోని అందరూ ఆ బ్యాంకు క్యాషియర్ కు జేజేలు కొడుతూ బ్యాంకుకు వెళ్లి ఫ్రీ డబ్బులు ఇస్తున్నారంటగా.. మాకు కూడా ఇవ్వండని అడుగుతారు.
దీంతో కంగుతిన్న బ్యాంకు మేనేజర్, క్యాషియర్ అది ఆయన సొంత డబ్బు విత్ డ్రా చేసుకుని తీసుకెళ్లిపోయాడని చీవాట్లు పెట్టి పంపించేస్తాడు. అప్పుడు బ్యాంక్ క్యాషియర్ ఫొటోకు పాలాభిషేకం చేస్తుండగా.. గ్రామస్థులు వచ్చి నీకేమైనా పిచ్చి పట్టిందా నీ డబ్బులు నువ్వే తీసుకుని మమ్నల్ని వెదవల్ని చేద్దామనుకుంటున్నావా? అని తిడతారు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన యువకుడు నేను అదే చెబుతున్నా.. వైఎస్ ఆర్ ఆటో నేస్తం అని ఆటో డ్రైవర్ల అకౌంట్ లో పది వేలు వేసినప్పుడు ఎందుకు పాలాభిషేకం చేశావు. అవేమైనా సాక్షి మీడియా అమ్మేసి ఇచ్చినా డబ్బులా అని ప్రశ్నిస్తాడు. అమ్మఓడి అని 13 వేలు అకౌంట్లో వేసినపుడు పాలాభిషేకం చేశారు కదా అవేమైనా భారతి సిమెంట్స్ అమ్మేసి ఇచ్చినవా రైతు భరోసాతో రైతుల అకౌంట్ లో ఏడు వేలు వేశాడని మురిసిపోయారు. లోటస్ పాండ్ ప్యాలెస్ అమ్మి మీకు పంచడానికి అనుకుంటున్నారా… భారతి సిమెంట్ బస్తా ధర 420, సాక్షి పేపర్ ధర రూ.6 ఇవి ఎవరికైనా ఫ్రీ గా ఇచ్చారా.. ఆరు రూపాయల పేపర్ ఫ్రీ గా ఇవ్వలేనోడు.. సొంత తల్లిని, చెల్లిని ఇంటి నుంచి గెంటిసినోడు మీకు ఇవన్నీ ఫ్రీగా ఎందుకు ఇస్తాడురా అంటూ వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ పథకాల వెనక ఉన్న మతలబును బయటపెట్టాడు.
రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని 13 లక్షల కోట్లు అప్పు ఉందని మీకు తెలుసా అంటూ ప్రశ్నిస్తాడు. మొత్తం మీద చంద్రబాబు వస్తే సంపద సృష్టిస్తాడని, రాకపోతే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోతుందని ప్రజల కళ్లు తెరిపించేలా షార్ట్ ఫిల్మ్ ని తీశారు. మరి దీని వల్ల ఎంతమందిలో మార్పు వస్తుందో ఎవరూ టీడీపీకి ఓటు వేస్తారో ఎన్నికలు అయితే గానీ తెలీదు.