Shubman Gill : ఇండియా క్రికెట్ టీంలో లుకలుకలు.. శుభ్ మన్ గిల్.. రోహిత్ శర్మకు పడట్లేదా..
Shubman Gill : టీం ఇండియా టీ 20 ప్రపంచ కప్ లో బిజి బిజీగా ఉంటే.. మరో వైపు శుభ్ మన్ గిల్ ను అమెరికా నుంచి ఇండియా వచ్చేశాడు. అయితే మొదట గిల్ బెంచ్ కే పరిమితమైన ఎక్స్ ట్రా ప్లేయర్ కాబట్టి వెస్టిండీస్ పిచ్ లపై అతడి అవసరం లేదని అందుకే వెనక్కి తిరిగి పంపించేస్తున్నారని అంతా అనుకున్నారు.
ఆ విధంగానే శుభమన్ గిల్ వచ్చేశాాడు. గిల్ తో పాటు అవేశ్ ఖాన్ కూడా తిరిగి ఇండియా చేరుకున్నారు. టీం ఇండియా 15 మంది జట్టు సభ్యులను అమెరికా పంపింది. వారితో పాటు గిల్, అవేశ్ ఖాన్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ లను రిజర్వ్ బెంచ్ ప్లేయర్లుగా తోడుగా పంపింది. ఎవరికైనా గాయమైనా.. అమెరికాకు ఇండియా నుంచి పంపించాలంటే చాలా కష్టం.. కాబట్టి వెంటనే మ్యాచ్ లు ఆడొచ్చనే ఉద్దేశంతో 19 మందిని సెలెక్ట్ చేసి పంపారు.
అయితే ఉన్నట్టుండి శుభమన్ గిల్, అవేశ్ ఖాన్ లను ఇంటికి పంపించేశారు. గిల్ ఇండియాకు వచ్చీ రాగానే వెంటనే రోహిత్ శర్మను ఇన్ స్టా గ్రాంలో అన్ ఫాలో అయ్యాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. అసలెందుకు రోహిత్ ను గిల్ అన్ ఫాలో అయ్యాడు. ఏమైనా వీరిద్దరి మధ్య సమస్యలు వచ్చాయా? టీం ఇండియా క్రికెట్ టీంలో గొడవలు జరుగుతున్నాయా? సీనియర్లు, జూనియర్లు అనే వివాదం నడుస్తుందా.. ఇటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఈ టోర్నీ తర్వాత కోచ్ నుంచి వైదొలగనున్నాడు.
ఈ క్రమంలో గిల్ రోహిత్ ను అన్ ఫాలో కావడం వెనక సుదీర్ఘమైన చర్చ నడుస్తోంది. మరో వైపు గిల్ అమెరికాలో టీం యాజమాన్యం చెప్పిన మాట వినకుండా ఇష్టారీతిన బయట తిరగడంతో అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగానే గిల్ ను ఇండియాకు తిరిగి పంపించారని టాక్. గిల్, రోహిత్ శర్మ మధ్య ఏం జరిగింది. గిల్ అమెరికా లో టీంకు చెప్పకుండా ఎటు వెళ్లిపోయాడు. అసలు టీం ఇండియా క్రికెట్ లో ఏం జరుగుతుందో తెలియక అభిమానులు కంగారు పడుతున్నారు. ఏదైమైనా ఇది టీం ఇండియా క్రికెట్ కు మంచిది కాదని బీసీసీఐ పెద్దలు రంగంలోకి దిగి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.