Home Minister Anita : ప్రతి జిల్లాో నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఏర్పాటు చేస్తామని, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ తమ ప్రభుత్వ లక్ష్యమని హోం మంత్రి అనిత తెలిపారు. డ్రగ్స్ కేసులను ఛేదించే విధంగా పోలీస్ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తామన్నారు. స్టేట్ టాస్క్ ఫోర్స్ విభాగం ద్వారా నిఘా వ్యవస్థను పెంచుతామన్నారు. టెక్నాలజీ ద్వారా గంజాయి సాగు, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని హోం మంత్రి తెలిపారు. డ్రోన్లు, శాటిలైట్లు, జీపీఎస్ ట్రాకింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఏఐ ఆధారిత సీసీ టీవీల వినియోగంతో డ్రగ్స్ ను కట్టడి చేస్తామన్నారు.
వ్యూహాత్మక చెక్ పోస్టులు, హాట్ స్పాట్ లు, ప్రత్యేక ఎన్డీపీఎస్ బీట్ల ద్వారా గంజాయి స్మగ్లింగ్ ను అరికడతామని తెలిపారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి గంజాయి ఆచూకీ తెలిపినవారిి ప్రభుత్వం తరపున రివార్డులు అందిస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు.