Sarpanch campaign : సెప్టెంబరు నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు ఒకరోజు ముందుగానే అంటే ఈరోజు (శనివారం 31, ఆగస్టు) పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో తెల్లవారుజాము నుంచే అధికారులు పింఛన్ల పంపిణీ చేపట్టారు. సీఎం చంద్రబాబు ఈరోజు కర్నూలు జిల్లా మండల కేంద్రం ఓర్వకల్లులో పర్యటించనున్నారు. ఓర్వకల్లులో సీఎం లబ్ధిదారులకు నేరుగా పింఛన్లను అందజేయనున్నారు. అనంతరం గ్రామసభ నిర్వహించనున్నారు.
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలం సింగవరంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సింగవరం సర్పంచ్, టీడీపీ నాయకుడు సంగన చిన పోశయ్య శుక్రవారం పింఛన్ల పంపిణీపై గ్రామమంతా తిరిగి ప్రచారం చేశాడు. సైకిల్ తొక్కుతూ ఓ చెత్తో మైక్ పట్టుకొని ‘శనివారం పింఛను తీసుకునే వాళ్లంతా ఇళ్ల వద్ద ఉండాలి’ అంటు గ్రామంలో ప్రచారం చేశాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వాస్తవానికి దండోరా వేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నాడు. ఆటో పెట్టి ప్రచారం చేసేంత స్తోమత లేదని, గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీ ఖజానాను ఖాళీ చేసిందని చెప్పారు.