– ఏర్పాట్లు చేస్తున్న బత్తిని కుటుంబం
Fish Prasadam : మృగశిర కార్తె సందర్భంగా జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రసాదం పంపిణీ దారులు బత్తిని కుటుంబ సభ్యులు ప్రకటించారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో 8న మందు ఇవ్వనున్నట్లు తెలిపారు. తాజాగా ప్రసాదం పంపిణీపై ప్రభుత్వ అనుమతి కూడా తీసుకున్నామని చెప్పారు. మరోవైపు వారు ప్రసాదం తయారీ ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిసింది. ప్రసాదం తింటే ఆస్తమా వ్యాధి తగ్గుతుందని ప్రజల విశ్వాసం.
చేప ప్రసాదం పంపిణీకి 170 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి నుంచి బత్తిని వంశస్తులు ఉచితంగా చేప ప్రసాదంను అందిస్తున్నారు. ఈ మందును ప్రతీ సంవత్సరం పంపిణీ చేసే బత్తిని సోదరులలో హరినాథ్ గౌడ్ ఒకరు. ఆయన 1944లో దూద్ బౌలిలో జన్మించారు. అతని నానమ్మ చేపమందు తయారీని తన పిల్లలకు నేర్పింది. హరినాథ్ గౌడ్ 2023 ఆగస్టు 24న హైదరాబాద్ లో మృతి చెందారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.