BJP Strategy : ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మూడు పార్టీల పొత్తు తెలంగాణలో కొనసాగడం పైన కొత్త చర్చ మొదలైంది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ పోటీ చేయలేదు. బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో అధికారపార్టీతో దరిదాపుగా ఎనిమిది స్థానాలు గెలిచిన బీజేపీ భవిష్యత్ పైన ఆశలు పెంచుకుంటోంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు పైన పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ వ్యాఖ్యల కారణంగా వాళ్లు టీడీపీ తో కలుస్తారా లేదా అన్న కొత్త సందేహం మొదలైంది. నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు బయలుదేరారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. అంతకు ముందు పవన్ కల్యాణ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున అభిమానుల సందడి నెలకొంది. పవన్ కళ్యాణ్ ఇంటికి సినీ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సైతం వచ్చారు. పవన్ కు సిద్దపేటలో అభిమానులు భారీగా తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో బీజేపీ, జనసేన పొత్తు ఇకముందు కూడా కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విధంగానే భవిష్యతులో కూడా రెండు పార్టీలు తిరిగి కలిసి పొత్తులో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీతో పొత్తు ఉన్నా.. తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేనకు మాత్రమే పొత్తుకు పరిమితం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు పవన్ మాటల్లో కనిపిస్తోంది. మరి కొద్ది రోజుల్లో తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ తో పాటుగా పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ -జనసేన పొత్తులో బీజేపీ ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిచింది. బీజేపీకి ఓట్లు.. సీట్లు పెరగటంతో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీచేయాలని.. అత్యధిక స్థానాలను గెలవాలని పక్కా వ్యూహాలను రచిస్తోంది. బీఆర్ఎస్ రాజకీయంగా బలహీనపడుతున్న సమయంలో తాము ఆ స్థానాన్ని భర్తీ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో..టీడీపీతో కలవడం కంటే..పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో భవిష్యత్ లో ఏపీ తరహాలోనే తెలంగాణలో కూడా మూడు పార్టీలు గెలుస్తాయా అనేది తెలియాల్సి ఉంది.