JAISW News Telugu

Instagram : ఇన్ స్టా, వాట్సప్ సేవలకు అంతరాయం..


Instagram and WhatsApp Services : సోషల్ మీడియా జమానాలో ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్స్ అయిన వాట్సప్, ఇన్ స్టాల సేవలకు నిమిషం అంతరాయం ఏర్పడినా యూజర్స్ గోల గోల చేస్తారు. సోషల్ మీడియాలో ఈ రెండింటి ఉపయోగం అంతా ఇంతా కాదు. ఇన్ స్టాను కాస్త (కొంచం వరకు) పక్కన పెడితే వాట్సప్ అయితే వృద్ధుల వరకు కూడా కావాల్సిందే. ఎందుకంటే ఎంతటి సమాచారన్ని అయినా చిటికెలో చేరవేసేది ఇదే కాబట్టి.

అలాంటి యాప్స్ కొన్ని నిమిషాలు నిలిచిపోతే ఇంకేమైనా ఉందా? గగ్గోలు పెట్టాల్సిందే. DownDetector నివేదిక ప్రకారం.. బుధవారం (ఏప్రిల్ 3) రాత్రి 11.22 గంటల ప్రాంతంలో Metaకు చెందిన 2 ప్రధాన ప్లాట్‌ ఫారమ్‌లలో సమస్యలు తలెత్తాయి. దాదాపు పావుగంటకు పైగా అంటే 11.37 గంటల వరకు సర్వర్ డౌన్ అయ్యింది. దీంతో యూజర్స్ 5049 కంటే ఎక్కువ మంది సమస్యలను మెటాకు ఫిర్యాదు చేశారు.

DownDetector ఏం చెప్పిందంటే 70 శాతం మంది వాట్సప్ యూజర్స్ సమస్యలు ఎదుర్కొన్నారు. 24 శాతం మంది మెసేజీల సెండింగ్ అండ్ రిసీవింగ్ లో ప్రాబ్లం ఎదురవుతుందని చెప్పారు. 6 శాతం మంది వాట్సప్ వెబ్‌తో ఇబ్బందులు పడ్డారు.

రాత్రి 11.22 గంటలకు వాట్సప్, సోషల్ సైట్ ఇన్‌ స్టాతో యూజర్స్ సమస్యను ఎదుర్కోవడం ప్రారంభమైంది. 10 నిమిషాల్లో సర్వర్ వేగంగా డౌనైంది. 15 నిమిషాల్లో, 5,049 కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాట్సప్, సోషల్ సైట్ ఇన్‌ స్టాలో సమస్యలను వివరించారు.

వరల్డ్ వైడ్ గా వాట్సప్, ఇన్‌ స్టా వినియోగదారులు మెసేసెస్ సెండ్ అండ్ రిసీవ్ లో వెబ్‌ యూజింగ్ లో సమస్యలను ఎదుర్కొన్నారు. చాలా వరకు మూజర్స్ సమస్యలను మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ (ట్విటర్) ద్వారా వివరించారు. మరికొందరు మీమ్స్ సంధించారు.

Exit mobile version