Jalmandali : హైదరాబాద్ లో తాగునీటి సరఫరాకు అంతరాయం: జలమండలి

Hyderabad Jalmandali
Jalmandali : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నేడు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి తెలిపింది. కృష్ణానది తాగునీటి సరఫరా ఫేజ్-1లోని పైపు లైన్ లో దేవత్ పల్లి వద్ద 300 ఎంఎం డయా ఎయిర్ వాల్వ్ లో ఆకస్మికంగా భారీ లీకేజీ ఏర్పడిందని జలమండలి ఏండీ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ భారీ లీకేజీ కారణంగా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు చెప్పారు.
లీకేజీ మరమ్మతులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నేటి మధ్యాహ్నం 3 గంటల లోపు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎయిర్ వాల్వ్ లీకేజీ వల్ల మిరాలం, కిషన్ బాగ్, సంతోష్ నగర్, వినయ్ నగర్, సైదాబాద్, చంచల్ గూడ, యాకుత్ పురా, ఆలియాబాద్, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, నారాయణగూడ, అడిక్ మెట్, శివం రోడ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్ సుఖ్ నగర్, మన్నెగూడ ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి ప్రకటించింది.