
UPI services
UPI services : నిన్న రాత్రి 7.30 గంటలకు దేశవ్యాప్తంగా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం వంటి యాప్‌లు పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందిపడ్డారు. గంట తర్వాత సమస్యను పరిష్కరించినట్లు ఎన్‌పీసీఐ తెలిపింది. అయితే కొంతమంది వినియోగదారులు ఇంకా సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.