MLC Janga Krishnamurthy : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

MLC Janga Krishnamurthy
MLC Janga Krishnamurthy : ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి ఛైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపు కారణంగా ఆయనపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతల ఫిర్యాదుపై శాసన మండలి ఛైర్మన్ మోషేనురాజు జంగా కృష్ణమూర్తి నుంచి పలుసార్లు వివరణ తీసుకున్నారు. జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య కాలంలో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయనను వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గానూ పనిచేశారు. అయితే, ఏప్రిల్ 1న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 6న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్ష్లంలో టీడీపీలో చేరారు.