BRS MLAs : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత.. హైకోర్టులో పాల్ వాదనలు

 

BRS MLAs

BRS MLAs

BRS MLAs : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం (అక్టోబరు 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పాల్ పార్టీ ఇన్ పర్సన్ (స్వయంగా) గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబరు 4కు వాయిదా వేసింది. కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

TAGS