High Court : ఎమ్మెల్యేలపై అనర్హత కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా

High Court
High Court : పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసు విచారణను తెలంగాణ హైకోర్టు నవంబరు 11కు వాయిదా వేసింది. శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మోహన్ రావు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాలసి ఉంటుందని ఈ మేరకు ఆయన పలు కోర్టుల తీర్పులను చదివి వినిపించారు. ఆయన వాదనలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.