JAISW News Telugu

YCP MLC : మరో వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హతా వేటు.. కోర్టులో నిలబడదని తెలిసినా..

YCP MLC

YCP MLC

YCP MLC : మరో వైసీపీ ఎమ్మెల్సీపై అనర్హతా వేటు వేశారు శాసనమండలి చైర్మన్. ఇందుకూరి రఘురామరాజు అనే ఎమ్మెల్సీపై మండలి చైర్మన్ వేటు ఎందుకు వేశారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన టీడీపీలో చేరలేదు. విప్ ఉల్లంఘించనూ లేదు. అయినా వేటు వేశారు. దీనికి కారణం ఆయన భార్య టీడీపీలో చేరడమే. టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనడం. ఇలాంటి వాటికే అనర్హతా వేటు వేస్తారా అంటే వేస్తారు. కోర్టుల్లో నిలబడవని తెలిసినా.. తమ పంతం నెగ్గించుకోవడానికి వేస్తారు. అదే చేశారిప్పుడు.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం అధికారికంగా పార్టీ మారితేనో లేకపోతే విప్ ఉల్లంఘిస్తేనో వేటు వేస్తారు. అది కూడా పూర్తిస్థాయిలో విచారణ జరిపి.. వివరణ తీసుకున్న తర్వాతనే. కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తేడా వస్తే ఏమీ చేయలేమన్న ఉద్దేశంతో రాత్రికి రాత్రే ఆయనపై అనర్హతా వేటు వేశారు. ఎన్నికలకు ముందు రఘురాజు భార్యతో సహా ఆయన వర్గీయులంతా టీడీపీలో చేరిపోయారు. బొత్స సత్యనారాయణ కుట్రలు చేయడం.. ఎన్నికల్లో వైసీపీ గెలిచే పరిస్థితి లేదని భావించి వారు పార్టీ మారిపోయారు.

శృంగవరపు కోట నియోజకవర్గంలో రఘురాజుకు మంచి పట్టు ఉందనే చెప్పాలి. ఆయన పార్టీ మారిపోవడం వల్ల వైసీపీ అక్కడ ఓడిపోవడంతో పాటు విశాఖ పట్టణం లోక్ సభలోనూ వెనకపడిపోతుందన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో బొత్స సత్యనారాయణ ఆయనపై అనర్హతా వేటు వేయించడానికి కసరత్తు చేశారు. నోటీసులు ఇచ్చినా వివరణ రాలేదన్న కారణం చెప్పి వేటు వేసేశారు.

Exit mobile version