JAISW News Telugu

Pregnant : యుకెలో గర్భవతి మహిళను ఉద్యోగం  నుంచి తొలగింపు.. రూ. 23 లక్షలు జరిమానా

pregnant Women : యుకె లోని ఒక మహిళ ప్రసూతి సెలవు నుంచి పనికి తిరిగి వచ్చిన తర్వాత, మళ్లీ గర్భవతి అయినందుకు కంపెనీ తొలగించింది. ఫస్ట్ గ్రేడ్ ప్రాజెక్ట్స్ లో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ గా పనిచేసిన నికితా ట్విచెన్ (27) ఉద్యోగం కోల్పోయినందుకు ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ పరిహారంగా రూ. 23 లక్షలు అందజేసింది.

డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. నికితా సెలవు తర్వాత మళ్లీ పనిలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఆ సమయంలో ఆమె మళ్లీ గర్భవతి అని తెలుసుకున్న మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ మోర్గాన్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. 36 వారాల ప్రసూతి సెలవుపై వెళ్లకుండా ఆమెను ఆపారు. దీంతో నిరుద్యోగిగా ఉన్న నికిత తన అవసరాలు తీర్చుకోవడానికి గర్భవతిగా ఉండి క్లీనింగ్ వంటి ఉద్యోగాలను చేసింది.

ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకువెళ్లింది. అక్కడ న్యాయమూర్తి నికితను అన్యాయంగా తొలగించారని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ మోర్గాన్ ప్రవర్తించిన తీరు అన్యాయం మరియు వివక్షతతో కూడుకున్నదని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీని తరువాత, మోర్గాన్ నికితాకు రూ.23 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

Exit mobile version