EVMs Verification : ఈవీఎంల వెరిఫికేషన్ పై పిటిషన్ల కొట్టివేత
EVMs Verification : ఈవీఎంలు, వీవీ ప్యాట్ల వెరిఫికేషన్లపై దాఖలైన మొత్తం పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈవీఎంల పనితీరులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను శుక్రవారం కొట్టివేసింది. ‘ఊహల ప్రకారం వెళ్లలేము’ అని కోర్టు పేర్కొంది. ఈవీఎంలలో నమోదయ్యే ఓట్ల సంఖ్యను వీవీప్యాట్ల నుంచి జారీ అయ్యే స్లిప్పులతో సరిపోల్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. అయితే సీల్ చేసిన సింబల్ లోడింగ్ యూనిట్లను ఈవీఎం స్ట్రాంగ్ రూంలలో భద్రపరచాలని కోర్టు సూచించింది. ఇక పేపర్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలన్న పిటిషన్లను సైతం కోర్టు కొట్టివేసింది.
ఎన్సీఆర్ లో రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు, వీవీప్యాట్ల కోసం కొనసాగుతున్న ఫస్ట్ లెవల్ చెకింగ్ (ఎఫ్ ఎల్ సీ) ప్రక్రియను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు అంతకుముందు కొట్టివేసింది.