JAISW News Telugu

Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ లో 223 మంది ఉద్యోగుల తొలగింపు

Delhi

Delhi Commission for Women

Delhi : ఢిల్లీ మహిళా కమిషన్ లో 223 మంది ఉద్యోగులను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తొలగించారు. దేశ రాజధానిలో లెఫ్టినెంట్ గవర్నర్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మహిళా కమిషన్ కు చెందిన 223 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించారు. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ కమిషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు వీరిని నియమించినట్లు తెలుస్తోంది.

అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం గురువారం 223 మంది ఉద్యోగుల తొలగింపు ఉత్తర్వులను జారీ చేసింది. గత చైర్ పర్సన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ వీరిని నియమించారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

‘‘చట్ట ప్రకారం ఢిల్లీ మహిళా కమిషన్ లో 40 పోస్టులను మాత్రమే కేటాయించారు. కానీ మాజీ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్.. లెఫ్టినెంట్ గవర్నర్, ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే 223 కొత్త ఉద్యోగాలను సృష్టించారు. కాంట్రాక్టు ఉద్యోగుల కింద వీరిని నియమించుకున్నారు. అయితే, ఒప్పమద నియామకాలు చేపట్టేందుకు కమిషన్ కు అధికారం లేదు. ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ప్రభుత్వంపై అదనపు భారం మోపే నిర్ణయాలను కమిషన్ తీసుకోకూడదు’’ అని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Exit mobile version