PM Modi : తెలంగాణలో ‘ఆర్ఆర్’ టాక్స్ పై చర్చ మొదలైందని పీఎం మోదీ అన్నారు. ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో పీఎం మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాజరాజేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కోడె ముక్కులు చెల్లించారు. అనంతరం బీజేపీ శ్రేణులు ఏర్పటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కుటుంబాలే ఫస్ట్ అని, వాటిల్లో పెద్ద తేడా ఏమీ లేదన్నారు. ఆ పార్టీలను అవినీతి కలుపుతోందని ఆరోపించారు. ఓటుకు నోటు కేసుపై బీఆర్ఎస్ ఎందుకు విచారణ చేయించలేదు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై కాంగ్రెస్ ఇంతవరకూ ఎందుకు విచారణకు ఆదేశించలేదని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తే.. ఇప్పుడు 3, 4 నెలల్లోనే ‘ఆర్ఆర్’ (రేవంత్, రాహుల్) ట్యాక్స్ దాన్ని మించిపోయిందని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అతి కష్టంగా కరీంనగర్ నియోజకవర్గంలో అభ్యర్థిని నిలిపిందని, పీవీని కాంగ్రెస్ ఎలా అవమానించిందో అందరం చూశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.