Ajit Pawar : సుప్రీం కోర్టులో అజిత్ పవార్ కు నిరాశ.. సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని సూచన
Ajit Pawar : ఎన్నికల ప్రచారంలో శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు ఉపయోగించొద్దని అజిత్ పవార్ వర్గాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైనట్లయింది. ఎన్సీపీ వ్యవస్థాపకుడైన శరద్ పవార్ ఫొటోలు, వీడియోలు ఎన్నికల ప్రచారంలో వినియోగించ వద్దని ఆదేశించింది. అలాగే సొంతకాళ్లపై నిల్చోవడం నేర్చుకోవాలని సూచించింది.
గత ఏడాది ఎన్సీపీ నుంచి చీలిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ-శిందే సర్కారుకు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆయన వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలూ మంత్రులయ్యారు. దాంతో పార్టీ రెండుగా చీలిపోగా, అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్సీపీగా ఎన్నికల సంఘం గుర్తించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో ఎక్కువ మంది కలిగిన అజిత్ వర్గమే పార్టీ చిహ్నం, ఎన్నికల గుర్తును దక్కించుకుంది. అయితే ప్రస్తుతం జరుగుతోన్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీనియర్ పవార్ ఫొటోలను వాడుతున్నారని ఆరోపిస్తూ ఆయన మద్దతుదారులు సుప్రీంను ఆశ్రయించారు. ఈ క్రమంలో సుప్రీం ధర్మాసనం తాజా ఆదేశాలు జారీ చేసింది.