Guntur Kaaram : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘గుంటూరు కారం’ మరో నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. నిన్న ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చెయ్యగా, దానికి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్ని రోజులు మేము చూడాలని కోరుకున్న మాస్ మహేష్ ని చూపించినందుకు ధన్యవాదాలు అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పొగడ్తలతో ముంచి ఎత్తారు.
ఇకపోతే ఈ సినిమాకి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రేపు గుంటూరు లో భారత్ పెట్రోల్ బంక్ సమీపం లో నంబూరు క్రాస్ రోడ్స్ లో జరపబోతున్నట్టు సమాచారం. ముందుగా జనవరి 6 వ తేదీన హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెయ్యాలని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల గుంటూరు కి షిఫ్ట్ చేసారు.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యింది. అక్కడ ట్రెండింగ్ మామూలు రేంజ్ లో లేదు. కచ్చితంగా ప్రీమియర్ షోస్ నుండే రెండు మిలియన్ డాలర్లు కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ బెంగళూరు లో మాత్రం అనుకున్న రేంజ్ బుకింగ్స్ అయితే అసలు లేవు. నిన్న ఉదయం నుండి బెంగళూరు లోని టాప్ థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ‘సలార్’ రేంజ్ లో బుకింగ్స్ జరుగుతాయి అనుకుంటే, కనీసం ‘బ్రో’ రేంజ్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. గడిచిన 24 గంటల్లో కేవలం 10 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయట. సలార్ చిత్రానికి గంటకి అమ్ముడుపోయిన టిక్కెట్లు, ‘గుంటూరు కారం’ కి 24 గంటలకు అయ్యిందంటే ట్రెండ్ స్లో గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఈమధ్య కాలం లో బెంగళూరు సిటీ లో రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను జనాలు చూడడం మానేశారు.
కేవలం భారీ స్కేల్ తో వచ్చే భారీ కాంబినేషన్ సినిమాలనే వాళ్ళు ఆదరిస్తున్నారు. అందుకే ‘గుంటూరు కారం’ సినిమాకి బుకింగ్స్ తక్కువగా ఉన్నాయని, ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ప్రారంభం అయితే సూపర్ స్టార్ మాస్ ఏంటో చూస్తారు అంటూ సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో 30 రూపాయిల టికెట్ హైక్ ని పెంచుకోవడానికి అనుమతి రాగా, తెలంగాణ లో ఇంకా అనుమతి రావాల్సి ఉంది.