America : హైదరాబాద్‌కు చెందిన ఓ విద్యార్థి అమెరికాలో కనిపించకుండా (అదృశ్య) పోవడంతో అతని కుటుంబానికి సమాచారం అందింది. ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్ యూనివర్సిటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న మహమ్మద్ అబ్దుల్ అర్ఫత్ (25) మార్చి 7వ తేదీ నుంచి కుటుంబంతో టచ్‌లో లేడు.
హైదరాబాద్ సమీపంలోని మల్కాజ్‌గిరి జిల్లాలో నివసిస్తున్న అతని తల్లిదండ్రులకు 12,000 డాలర్లు డిమాండ్ చేస్తూ అన్ నవున్ కాల్ వచ్చింది. మీ కుమారుడిని కిడ్నాప్ చేశామని, కిడ్నీ అమ్మేస్తానని బెదిరించినట్లు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు.
‘అర్ఫత్ మే, 2023లో చదువు నిమిత్తం అమెరికా వెళ్లాడు. ప్రతీ రోజు ఫోన్ చేసేవాడు. మార్చి 7వ తేదీ నుంచి అతని నుంచి కాల్ రాలేదు. దీంతో ఆందోళనకు గురయ్యాం. అంతలోనే డబ్బులు డిమాండ్ చేస్తూ కాల్ రావడంతో ఆందోళన చెందాం’ అని అతని కుటుంబం పేర్కొంది.
అతని తండ్రి మహ్మద్ సలీమ్‌కు గత వారం క్లీవ్‌ల్యాండ్‌లో డ్రగ్స్ అమ్మే ముఠా తన కొడుకును కిడ్నాప్ చేసిందని గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి కిడ్నాప్ నుంచి రిలీజ్ చేయాలంటే కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ ఎలా అందజేయాలో కిడ్నాపర్ చెప్పలేదు.
ఆందోళనకు గురైన అర్ఫత్ తండ్రి సలీమ్ USలోని తన బంధువులకు సమాచారం అందించాడు. వారు క్లీవ్‌ల్యాండ్ పోలీసులను ఆశ్రయించి మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీంతో పోలీసులు వాచ్ ఆర్డర్ జారీ చేశారు. ఆర్డర్ ప్రకారం అర్ఫత్ తెల్లటి టీ షర్ట్, ఎరుపు రంగు జాకెట్, బ్లూ జీన్స్ ధరించాడు.
మార్చి 18వ తేదీ అర్ఫత్ ను కనుగొనడంలో సాయం చేయాలని ఆయన కుటుంబం చికాగోలోని భారత కాన్సులేట్‌కు లేఖ రాసింది. సలీమ్ తన కుమారుడిని కనుగొనడంలో సహాయం కోసం విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా అభ్యర్థించాడు.