Pawan Kalyan : పవన్ కల్యాణ్ కోసం తమ కెరీర్ ను త్యాగం చేస్తున్న డైరెక్టర్లు!

Pawan Kalyan!

Pawan Kalyan Directors

Pawan Kalyan : పవన్ కల్యాణ్ క్రేజ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతట కనిపిస్తోంది. సినీ నటుడిగానే కాదు రాజకీయాల్లోనూ ఆయన సంచలనాలు సృష్టిస్తున్నాడు. మోదీ సైతం జాతీయ వేదికల్లో పవన్ కల్యాణ్ ను పొగుడుతున్నారు. దీంతో పవన్ రేంజ్ జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. పవన్ కు ఒక్కసారి ఫ్యాన్ అయ్యారంటే ఇక జీవితాంతం ఆయన్ను వదులుకోలేరు. ఇది ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఎంతో మంది డైరెక్టర్ల పరిస్థితి కూడా.

పవన్ కల్యాణ్ సినిమాలకు దర్శకుడిగానే కాకుండా ఆయనకు మంచి స్నేహితుడిగా, నమ్మినబంటుగా పవన్ మనసు తెలిసిన వాడిగా త్రివిక్రమ్ ను అందరూ చెబుతుంటారు. పవన్ కు సంబంధించిన స్టోరీ సెలక్షన్స్ ని తనే దగ్గరుండి చూసుకుంటున్నాడు. ఇక వేరే భాషల్లో సక్సెస్ అయిన సినిమాలను పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాసి వాటిని తొందరగా సెట్స్ మీదకు తీసుకెళ్లి..దర్శకుడిని కూడా తానే సెట్ చేస్తాడు. అందువల్లే తన సొంత సినిమాలను లేట్ చేసుకుంటూ చాలా వరకు తన కెరీర్ ను కోల్పోతున్నాడు అంటూ త్రివిక్రమ్ మీద చాలా విమర్శలు కూడా వస్తున్నాయి.

ఇక ఆయనతో పాటు హరీశ్ శంకర్, క్రిష్ లాంటి దర్శకులు కూడా పవన్ వల్ల చాలా వరకు కెరీర్ ను ఫైనాన్షియల్ గా, సక్సెస్ లా పరంగా నష్టపోయారనే చెప్పాలి. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ను స్టార్ట్ చేసి నాలుగేండ్లు అవుతుంది. కొన్ని రోజులుగా కరోనాతో, కొన్ని రోజులు పవన్ రాజకీయాల కోసం వాయిదాలు పడుకుంటూ వచ్చింది. ఇక వ్యక్తిగత కారణాలతో ఆయన ఆ సినిమా నుంచి కూడా తప్పుకున్నారు.

హరీశ్ శంకర్ ది అదే పరిస్థితి. 2019లో వచ్చిన గద్దలకొండ గణేశ్ తర్వాత మరే సినిమా రాలేదు. పవన్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా చేయాలనే ఉద్దేశంతో వేరే స్క్రిప్ట్ లన్నీ పక్కనపెట్టారు. చివరకు పవన్ ఎన్నికల ప్రచారంలో బిజీ కావడం, ఎన్నికల్లో ఘన విజయం సాధించడం, ఆ తర్వాత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉండడం..ఇలాంటి వాటితో ఆ సినిమా లేట్ అవుతోంది. దీంతో హరీశ్..రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ తీస్తున్నారు.

అయితే ఈ దర్శకులంతా పవన్ మీద ఉండే ఇష్టంతోనే తమ సినిమా కెరీర్ పణంగా పెడుతున్నారనేది తెలిసిందే. పవన్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉండడంతో..ఆయన తొలి ప్రాధాన్యం ప్రజా సేవపైనే ఉంటుంది. ఆయన కూడా అదే చెప్పారు. కొన్ని రోజుల తర్వత ఏదైనా చిన్న గ్యాప్ దొరికితే చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని తెలిపారు.

TAGS