Shankar Daughter Second Marriage : ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సామాజిక అంశాలను స్పృశిస్తూ.. టెక్నాలజీని మేళవించి ఆయన చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ హిట్ అవుతూ వస్తుంది. ఇదంతా పక్కన పెడితే తన కూమార్తె రెండో వివాహాన్ని తన అసిస్టెంట్ కు ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చితార్థం కూడా నర్వహించాడు.
శంకర్ పెద్ద కూతురు ఐశ్వర్య నిశ్చితార్థ ఆదివారం సాయంత్రం (ఫిబ్రవరి 18) ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించి ఫొటోలను శంకర్ రెండో కూతురు అదితి తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసింది. శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న తరుణ్ కార్తికేయన్‌తో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తరుణ్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
ఈ క్రమంలో తరుణ్, ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ఇప్పుడు పెళ్లి వరకు తీసుకెళ్లింది. ఈ వివాహాన్ని మాత్రం శంకర్ దగ్గరుండి కుదిర్చాడని టాక్ వినిపిస్తుంది. మొదటి పెళ్లి విషయంలో పడ్డ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు తీసుకున్నారని చెబుతున్నారు. త్వరలోనే పెళ్లి తేదీ ఫిక్స్ చేసి వివరాలు ప్రకటిస్తారట.
వృత్తి రీత్యా ఐశ్వర్య డాక్టర్ కాగా.. తరుణ్ అసిస్టెంట్ డైరెక్టర్, లిరికిస్ట్, ప్లే బ్యాక్ సింగర్ ఇలా చాలా రోల్స్ చేస్తుంటాడు. శంకర్ వద్ద చాలా ఏళ్లుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘భారతీయుడు 2’, రామ్ చరణ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’కు శంకర్ టీమ్‌లో తరుణ్ పని చేస్తున్నారు. ‘భారతీయుడు 2’ ఈ ఏడాదిలోనే విడుదల కానుండగా.. ‘గేమ్ ఛేంజర్’ తెలియాల్సి ఉంది. డేట్ విషయంలో క్లారిటీ రావడం లేదు.
ఐశ్వర్య శంకర్‌కు మూడేళ్ల క్రితం క్రికెటర్ రోహిత్ దామోదరన్‌తో వివాహమైంది. ఈ పెళ్లి వేడుక తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. దీనికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు కూడా వచ్చారు. కానీ తక్కువ కాలంలో ఈ జంట విడాకులు తీసుకుంది. రోహిత్‌పై తన అకాడమీలో వచ్చిన ఆరోపణలు, ఆ తర్వాత నమోదైన పోస్కో కేసే డైవర్స్ వరకు తీసుకెళ్లినట్లు సమాచారం. రోహిత్ ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కాగా.. 16 ఏళ్ల బాలిక లైంగిక ఆరోపణలపై ఆయనపై కేసు పెట్టింది.