JAISW News Telugu

Director RGV : నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడం ఎందుకు ?.. మంత్రి వ్యాఖ్యలపై ఆర్జీవీ ఆగ్రహం

Director RGV

Director RGV

Director RGV : తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ ఏకతాటి పైకి వచ్చి ఖండిస్తున్నారు. సమంత మీద, అక్కినేని కుటుంబాల గౌరవాన్ని తగ్గించేలా, వారి స్థాయిని దిగజార్చేలా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఇండస్ట్రీ మొత్తం ఖండిస్తున్నారు. నాగార్జున, అమల, సమంత, నాగ చైతన్య, అఖిల్, నాని, సుధీర్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా అందరూ మంత్రి వ్యాఖ్యలను తప్పుపట్టారు. తాజాగా చిరంజీవి సైతం ఆమె వ్యాఖ్యలపు తప్పపట్టి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇప్పుడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కంటిన్యూగా ట్వీట్లు వేస్తూనే ఉన్నారు.

‘‘నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లు విని నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించకూడదు.. కేటీఆర్‌ను దూషించే క్రమంలో అక్కినేని ఫ్యామిలీని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో కనీసం నాకర్ధమవ్వటంలేదు ? తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారని అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి?’’ అంటూ రాసుకొచ్చారు.

మరో ట్వీట్ లో ..‘‘4th గ్రేడ్ వెబ్‌సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు తనేదో తన కన్నులతో చూసి తన చెవులతో విన్నట్లు కన్ఫర్మేషన్‌తో మీడియా ముందు అరచి చెప్పటం దారుణం ఒక మినిస్టర్ హోదాలో ఉండి నాగార్జున, నాగ చైతన్యలాంటి డిగ్నిఫైడ్ కుటుంబాన్ని, సమంత లాంటి ఇండస్ట్రీ గర్వించదగ్గ ఒక మహా నటి మీద అంత నీచమైన మాటలనంటాన్ని తీవ్రంగా ఖండించాలి’’ అన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో వెంటనే ఇన్‌టర్‌ఫేర్ అయ్యి ఇలాంటివి జరగకుండా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని ఇండస్ట్రీ తరపునుంచి అడుగుతున్నామని వర్మ ట్వీట్లు వేస్తూ వచ్చాడు.

ఐఏఎస్ స్మితా సబర్వాల్ ట్వీట్..

కొండా సురేఖ వ్యాఖ్యలపై ఐఏఎస్ స్మితా సబర్వాల్ స్పందించారు. ‘‘సమాజంలో మహిళలు సంచలనాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. నేను వ్యక్తిగత అనుభవం నుండి మాట్లాడుతున్నాను. మహిళలను, కుటుంబాలను, సామాజిక నిబంధనలను గౌరవిద్దాం. అంత గౌరవప్రదంగా లేని ప్రకటన చూసి ఆశ్చర్యపోయారు. మంత్రి గారు అంతా రాజకీయాల కోసం కాకూడదు. ప్రజా జీవితంలో ఆరోగ్యకరమైన ఉపన్యాసాన్ని నిర్మించుకుందాం.’’ అంటూ రాసుకొచ్చారు.

Exit mobile version