Director RGV : కొండా సురేఖ వివాదంలో ఆర్జీవి ఎంట్రీ ఆయన ఏమన్నాడంటే
కానీ నాగచైతన్య నాగార్జున ఇద్దరు కలిసి కొండా సురేఖకు జీవితంలో అతిపెద్ద గుణపాఠం చెప్పాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి కేవలం సారీ చెప్తే సరిపోతుందా అని అన్నాడు. దీంతో కొండా సురేఖకు మద్దతు తెలుపుతున్నాడా? ఇటు నాగార్జున ఫ్యామిలీకి మద్దతు తెలుపుతున్నాడా తెలియక తలలు పట్టుకుంటున్నారు. కాగా కొండా సురేఖ మాట్లాడిన మాటలపై ఈ మధ్యాహ్నం తెలుగు ఫిలిం ఛాంబర్ లో ప్రముఖులంతా కలిసి మీటింగ్ పెట్టనున్నారు. ఇప్పటికే చిరంజీవి, అల్లు అర్జున్ మిగతా ప్రముఖులు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
కాగా తెలుగు ఫిల్మ్ చాంబర్లో పెట్టబోయే మీటింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కొండా సురేఖను ఏం అడగనున్నారు అని అందరూ వేచి చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలుగు ఫిలిం ఛాంబర్ మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించాలని డిమాండ్ చేసే అవకాశం ఉంది. కాగా నాగార్జున ఈ సాయంత్రం హైదరాబాద్ చేరుకొని డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. లీగల్ నోటీసు ఇస్తానని ఇప్పటికే ప్రకటించిన నాగార్జున ఈ విషయంలో ఏ మాత్రం ఉపేక్షించేది లేదని కచ్చితంగా కొండా సురేఖ పై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
దీంతో నాగార్జున సీరియస్ కావడంతో వివాదం కాస్త ముదిరిపోయింది. ఇటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని సినీ పెద్దలు అంతా ఏకమయ్యారు. ఇప్పటికే కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. నటి సమంత కూడా తనను రాజకీయాల్లోకి లాగొద్దని తన విడాకులకు రాజకీయ నాయకులకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. నాగార్జున భార్య అమల కొండా సురేఖను దయ్యంతో పోల్చింది. నాగచైతన్య, నాగార్జున కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం మీద కొండా సురేఖ కేటీఆర్ పై చేయాల్సిన వ్యాఖ్యలు నాగార్జున ఫ్యామిలీ పై చేయడంతో ఇది కాస్త కొండా సురేఖ మెడకు చుట్టుకుంటుంది.