JAISW News Telugu

Nag Ashwin : లైఫ్ ఒక జిందగీ అయిపోయింది మామా..  క్లల్కి రిలీజ్ అనంతరం ఆసక్తికర పోస్టు చేసిన డైరెక్టర్  నాగ్ అశ్విన్

Nag Ashwin

Nag Ashwin

Nag Ashwin : నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్.  తెలుగులో అగ్ర నిర్మాత అశ్వినీ దత్ కూతురు స్వప్న దత్ భర్త నాగ్ అశ్విన్. జాతి రత్నాలు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన స్వప్న దత్ అప్పటి నుంచి ఫేమస్ కాగా..  నాగ్ అశ్విన్ మహానటితో సావిత్రి జీవితాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.

నాగ్ అశ్విన్ తాజాగా తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఈ మూవీ కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ప్రతిబింబించే చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫిక్ తో అరిగిపోయి తెగిపోయిన చెప్పుల ఫొటోతో పాటు.. లైఫ్ ఒక జిందగీ అయిపోయింది మామా అంటూ తాను వేసుకున్న టీషర్టుతో దిగిన ఫొటోను పెట్టాడు.

దీంతో కల్కి 2898 ఏడీకి తాను పడిన కష్టం ఏంటో చెప్పకనే చెప్పాడు. గతంలో చాలా మంది అంటుంటే వారు. చెప్పులరిగేలా తిరిగినా పని కాలేదని.. ఇక్కడ మాత్రం చెప్పులరిగేలా పని చేశానని.. లైఫ్ అంటే జిందగీ అయిపోయింది మామా అంటున్నాడు నాగ్ అశ్విన్.. జిందగీ అనగానే మనిషి జీవితం మొత్తం అని అర్థం వస్తుంది. కానీ నాగ్ అశ్విన్ కు మాత్రం జిందగీ మాత్రం కల్కి 2898 ఏడీతోనే కనిపించిందని తెలుస్తోంది.

కల్కి 2898 ఏడీలో ప్రభాస్ కథానాయకుడిగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, శోభన, మాళవిక, దీపికా పదుకొనే లాంటి అగ్ర నటీనటులు ఈ మూవీలో నటించారు. దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. వైజయంతి మూవీస్ లో నిర్మించిన అతిపెద్ద మూవీ ఇదే కావడం విశేషం. దీనికనుగుణంగానే మొదటి రోజు కలెక్షన్లు దాదాపు 200 కోట్ల వరకు వసూళ్లు రాబట్టిందని నేషనల్ మీడియాతో కథనాలు వస్తున్నాయి. మరి ఈ సక్సెస్ ను  నాగ్ అశ్విన్ ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడని అర్థమవుతుంది. 

Exit mobile version