Hari Hara Veera Mallu : ‘హరి హర వీరమల్లు’ నుండి పూర్తిగా తప్పుకున్న డైరెక్టర్ క్రిష్..!

Director Krish, who completely left 'Hari Hara Veeramallu'..

Director Krish, who completely left ‘Hari Hara Veeramallu’..

Hari Hara Veera Mallu : ఏ ముహూర్తం లో పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా ప్రారంభించాడో తెలియదు కానీ, అప్పటి నుండి ఈ సినిమాకి అన్నీ అవాంతరాలే ఎదురు అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమాని ‘వకీల్ సాబ్’ చిత్రం తో పాటుగా ప్రారంభించాడు. ‘వకీల్ సాబ్’ సినిమా 2021 వ సంవత్సరం లో విడుదలైంది. ఆ సమయం లో సమాంతరంగా ప్రారంభమైన ‘హరిహర వీర మల్లు’ చిత్రం ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆగిపోయింది.

ఏడాది పాటు షూటింగ్ ఆగిపోయిన ఈ చిత్రం కి బదులుగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీ షూటింగ్ ని పూర్తి చేసాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ ఇచ్చి రెండు నెలల వరకు ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు నెలలు ఇంటర్వెల్ కి సంబంధించిన భారీ యాక్షన్ సన్నివేశాన్ని తెరకెక్కించారు.

ఇంటర్వెల్ షూటింగ్ పూర్తి అవ్వగానే పవన్ కళ్యాణ్ మరో షెడ్యూల్ తో సినిమాని పూర్తి చేసేస్తాడని అందరూ అనుకున్నారు, కానీ ఆయన మధ్యలో ‘బ్రో ది అవతార్’ సినిమాకి డేట్స్ కేటాయించాడు. ఆ సినిమా పూర్తి అయ్యాక అయినా ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని పూర్తి చేస్తాడేమో అని అనుకుంటే, మధ్యలో ‘ఓజీ’ సినిమా షూటింగ్ ని ప్రారంభించాడు. దాదాపుగా 70 వరకు ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేసాడు. కనీసం ఈ సినిమా తర్వాత అయినా ‘హరి హర వీరమల్లు’ ని పట్టించుకుంటాడేమో అని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఆయన ఈ గ్యాప్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులు చేసిన తర్వాత ఆయన రాజకీయాల్లో బిజీ అయ్యాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఓజీ’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలను పూర్తి చెయ్యడానికే తన మొట్టమొదటి ప్రాముఖ్యత ని చూపించబోతున్నాడు.

హరిహరవీరమల్లు మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభం అవ్వుధి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యం లో డైరెక్టర్ క్రిష్ వేరే సినిమాకి షిఫ్ట్ అయిపోయాడు. అనుష్క తో లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ని ఈ నెల 14 వ తారీఖు నుండి తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించనుంది. ఈ సినిమా తర్వాత క్రిష్ మళ్ళీ ‘హరి హర వీరమల్లు’ సినిమా తియ్యడానికి వస్తాడా?, లేదా శాశ్వతంగా దూరం అవుతాడా అనేది తెలియాల్సి ఉంది.

TAGS