Ustad Bhagat Singh : టాలీవుడ్ అగ్ర హిరోల్లో ఒకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒకరు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. పవన్ కల్యాణ్ మూవీలు ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా పొలిటిక్స్ లో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఓజీ చిత్రం గురించి తాజాగా పవన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ గా మారాయి.
పవన్ కల్యాణ్ చిత్రాలు మూడు ప్రస్తుతం షూటింగ్ దశలోనే ఆగిపోయాయి. చాలా చిత్రాలు బాగా ఆలస్యం కూడా అవుతున్నాయి. దీంతో నిర్మాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం మూడు సినిమాలకు అల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేసి మధ్యలోనే ఆగిపోయిన చిత్రాల్లో ఓజీ మూవీ ఒకటి.. టాప్ డైరెక్టర్ సుజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నాడు. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడితో హరిహర వీరమల్లు మూవీ కూడా షూటింగ్ కొంచెం పూర్తి చేసుకుంది. ఇది కూడా వెయిటింగ్ లిస్టులో ఉంది.
హరీశ్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లోనే ఉంది. అయితే దీనికి మిగతా రెండు సినిమాలకు పోలిక ఉన్నాయి. ముందుగా ఈ మూవీని భవదీయుడు భగత్ సింగ్ అని అనుకున్నారు. ఆ తర్వాత హిరోయిన్ విషయంలో కూడా తేడాలు రావడం.. వెంటనే దాన్ని మార్చడం. ఇలా అనేక మార్పులు జరిగాయి. ముందు పూజా హెగ్డెను హిరోయిన్ గా అనుకుని తర్వాత శ్రీలీలను హిరోయిన్ గా తీసుకున్నారు. ఇలా సినిమా ప్రారంభానికి ముందే చాలా మార్పులు జరిగాయి.
కొంతమంది అయితే ఇది పూర్తి రీమేక్ చిత్రం అని పుకార్లు సృష్టించారు. దీంతో హరీశ్ శంకర్ తో పాటు.. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విస్తుపోయారు. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్లస్ట్ గింఫ్స్ విడుదల చేయడంతో ఈ పుకార్లన్నింటికీ బ్రేక్ పడింది. పవన్ కల్యాణ్ లుక్స్ చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా వాటన్నింటినీ మరిచిపోయారు. దీంతో హరీశ్ శంకర్ ఇచ్చిన రిఫ్లై చూసి నెగిటివ్ కామెంట్స్ చేసే వారు నోరు మూసుకున్నారు.