JAISW News Telugu

Vijayawada-Dubai : విజయవాడ-దుబాయ్ మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభించాలి

Vijayawada-Dubai

Vijayawada-Dubai flight

Vijayawada-Dubai : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు నేరుగా విమాన సర్వీసును ప్రారంభించాల్సిందిగా ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ను ఏపీ చాంబర్స్‌ కోరింది. ఈ మేరకు ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ చైర్మన్, సీఈవో షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్‌కు మంగళవారం ఒక అధికారిక లేఖ రాసింది.

విజయవాడ నుంచి దుబాయ్‌కు ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్నందున గత ఐదు సంవత్సరాలుగా నేరుగా విమాన సర్వీసును నడపాలని తాము విజ్ఞప్తి చేస్తున్నామని ఏపీ చాంబర్స్‌ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు.

ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ బృందం విజయవాడ విమానాశ్రయాన్ని సందర్శించి అధ్యయనం చేసిందని, విమానాశ్రయం యొక్క సామర్థ్యంపై వారు సంతృప్తి వ్యక్తం చేయడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామం విజయవాడ మరియు దుబాయ్ మధ్య నేరుగా విమాన సర్వీసు ప్రారంభానికి సానుకూల సంకేతంగా భావించవచ్చు.

Exit mobile version