Dil Raju : ఆ సినిమా నుంచి తప్పుకొని సేఫ్ అయిన దిల్ రాజు
Dil Raju : టాలీవుడ్ లో విజయవంతమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు. ఎన్నో సూపర్ హిట్లు కొట్టిన ఈ బడా నిర్మాత కొన్ని ప్లాఫ్ సినిమాలను కూడా ఇచ్చాడు. సాధ్యమైనంత వరకు టేబుల్ ప్రాఫిట్ వచ్చేలా అన్ని చూసుకొని తన చిత్రాలను మొదలు పెడుతాడు. పెద్ద హీరోలతో పాటు కథా బలమున్న చిత్రాలకు పెద్ద పీట వేస్తుంటారు. అయితే తనకు పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టాయని పలు మార్లు చెప్పారు దిల్ రాజు. చిన్న సినిమాలకు రూపాయి ఖర్చు పెడితే తనకు ఐదింతలు లాభం వచ్చిందని ఆయా సినిమాల పేర్లు కూడా వెల్లడించారు.
అయితే పెద్ద సినిమాలు తనకు పేరు తెచ్చాయని, కానీ అనుకున్నంతగా లాభాలు మాత్రం రాలేదని కుండ బద్దలు కొట్టారు. అయితే ఈ విషయంలో తాను హీరోలను తప్పుపట్టనని, వాళ్ల మార్కెట్ ని బట్టే ఖర్చు పెడతానని, అంతా తన సొంత నిర్ణయాలేనని చెప్పారు. దిల్ రాజు సినిమాలు నిర్మిస్తూనే, డిస్ర్టిబ్యూషన్ రంగంలోనూ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల దిల్ రాజు నిర్మించిన చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి.. రీసెంట్ గా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమాతో దిల్ రాజు చేతులు కాల్చుకోక తప్పలేదు. ఆ సినిమా ప్లాఫ్ కావడంతో నష్టాలు చవిచూశాయి.
తాజాగా ఈ బడా నిర్మాత మరో పెద్ద నష్టం నుంచి బయట పడ్డారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతున్నది. అయితే దిల్ రాజు నష్టం నుంచి ఎలా బయట పడ్డారు.? అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ‘ఇండియన్ 2’ చిత్రానికి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా మూడు రోజుల్లో కేవలం రూ. 58 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. అయితే శనివారం కంటే ఆదివారం వసూళ్లు మరింత తగ్గడం నిర్మాతను షాక్ కు గురి చేశాయి. పాత కథ, కథనం కావడంతో ఈ సినిమా ఆడియన్స్ అంతగా రిసీవ్ చేసుకోలేదు. ఈ సినిమాని తీసిన లైకా ప్రొడక్షన్ భారీగా నష్టపోయింది. భారతీయుడు-2 సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నా, విడుదల తర్వాత మాత్రం పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ మూవీకి నెగిటివ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశపడ్డారు. ఈ సినిమాని ముందుగా దిల్ రాజు నిర్మించాలని అనుకున్నారట..
‘ఇండియన్ 2’ సినిమా నిర్మాణం ఆఫర్ ముందుగా దిల్ రాజుకే వచ్చింది. ఒప్పందాలు కూడా అయిపోయాయి. డైరెక్టర్ శంకర్ చేసిన ఆలస్యానికి తోడు భారీ బడ్జెట్ కారణంగా దిల్ రాజు ఈ సినిమా నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం సినిమా ఫలితం తారుమారు అవ్వడంతో భారతీయుడు 2 నుంచి దిల్ రాజు సేఫ్ గా బయట పడ్డారు అంటూ సోషల్ మీడియాలో పలువరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే డైరెక్టర్ శంకర్ దిల్ రాజుకి ‘గేమ్ ఛేంజర్’ కథ వినిపించారు. దీనికి దిల్ రాజు అంగీకరించి రామ్ చరణ్ తో సినిమాను పట్టాలెక్కించాడు.