Dil Raju : సినీ రిపోర్టర్ల పై దిల్ రాజు చిందులు..ఇంతకీ ఏం జరిగింది..

Dil Raju fires on film reporters
Dil Raju : దిల్ రాజు ప్రస్తుతం టాలీవుడ్ అగ్రనిర్మాతగా వెలుగొందుతున్నారు. నిర్మాతగానే కాదు రెండు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ గా కూడా ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్న నలుగురు నిర్మాతల్లో ఈయన ఒకరు. దిల్ రాజు నిజామాబాద్ నుంచి ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ ఫీల్డ్ కు వచ్చారు. చిన్న డిస్ట్రిబ్యూటర్ గా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే కష్టపడ్డారు. ఆ తర్వాత ‘దిల్’ సినిమాతో నిర్మాతగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలువడంతో ఆ సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆ సినిమా నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. బొమ్మరిల్లు, భద్ర, శతమానం భవతి..లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాస్తవానికి ఆయన సినిమాలు హిట్ ట్రాక్ ఉండడం, సినిమా వ్యాపారంపై ఆయనకు పూర్తి అవగాహన ఉండడం, పెద్ద హీరోల అండదండలు ఉండడంతో సినీ పరిశ్రమలో ఆయనకు తిరుగులేకుండా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలంటే జనాలకు విపరీతమైన మోజు ఉంటుంది. ఈ టైంలో సినిమా రిలీజ్ చేస్తే సూపర్ హిట్ కొట్టవచ్చని నిర్మాతలు భావిస్తుంటారు. అందుకే ఏడాది ముందే సంక్రాంతి డేట్లను లాక్ చేసుకుంటారు.
ఇప్పుడదే తెలుగు ఇండస్ట్రీలో వివాదానికి కారణమైంది. ఈ సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగ.. వీటికి ఇప్పుడు థియేటర్లు దొరకడం కష్టమై పోతోంది. అన్ని థియేటర్లను గుంటూరు కారం మూవీకే ఇస్తున్నారని తమకు ఇవ్వడం లేదని హనుమాన్ మూవీ టీం వాపోతోంది. ఇక మిగతా సినిమాలది అదే పరిస్థితి. ఈ పోరు పడలేక రవితేజ ఈగిల్ ఫిబ్రవరికి వాయిదా వేసుకున్నాడు.
ఈక్రమంలో థియేటర్ల కొరత, స్టార్ హీరో సినిమాకే థియేటర్లు ఇస్తున్నారనే ఆరోపణలతో కథనాలు వస్తున్నాయి. వీటిపై నిన్న హైదరాబాద్ సినీ మీడియా ప్రతినిధులపై దిల్ రాజు ఫైర్ అయ్యారు. తనపై లేనిపోనివి రాస్తే తాట తీస్తానంటూ రెచ్చిపోయారు. తాజాగా ఇవాళ కూడా ‘‘పిచ్చిపిచ్చిగా రాస్తే వదిలిపెట్టను.. గుర్తుపెట్టుకోండి.. ఏమనుకుంటున్నారు? ’’ అని తీవ్రంగా మందలిస్తున్నట్లు వీడియో బయటకు వచ్చింది. ఇది ప్రస్తుతం ఫుల్ వైరల్ గా మారింది. థియేటర్ల అరెంజ్ మెంట్ పై ఎక్కువ మంది దిల్ రాజును విమర్శిస్తూ కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు ఆయనకు సపోర్ట్ గా ట్వీట్ చేస్తున్నారు.
Dil mowa masss…
Andari Lage he is also doing business then what is wrong#DilRaju pic.twitter.com/52qYbXtKtA— Konidala Mahesh Babu 🌶️🌶️ (@Michealvelyudhm) January 9, 2024