Dil raju:సంక్రాంతి పందెంలో అరడజను పైగా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మహేష్ నటించిన గుంటూరు కారం, వెంకటష్ నటించిన సైంధవ్, నాగార్జున నా సామి రంగా, రవితేజ ఈగిల్, ప్రశాంత్ వర్మ తేజ సజ్జాల హను-మాన్ సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలు గంపగుత్తగా రిలీజవుతుంటే ఆ మేరకు థియేటర్ల సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నారు.
ఇటీవల ఫిలింఛాంబర్ లో జరిగిన సమావేశంలో నిర్మాతలంతా దీనిపై చర్చించారని తెలిసింది. అయితే ఒకట్రెండు సినిమాలు సంక్రాంతి రేసు నుంచి తప్పుకుంటే మేలు జరుగుతుందని అగ్రనిర్మాత దిల్ రాజు సూచించారని, అయితే దీనికి నిర్మాతల ససేమిరా అన్నారని కథనాలొచ్చాయి. అయితే ప్రశాంత్ వర్మతో తాను మాట్లాడానని దిల్ రాజు అన్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హను-మాన్ ట్రైలర్ విడుదలయ్యాక భారీ బజ్ పెరిగింది.
దీంతో సంక్రాంతి బరిలోనే ఈ సినిమా రిలీజ్ కావాలని టీమ్ భావిస్తోంది. కానీ ఇప్పుడు అగ్రనిర్మాత దిల్ రాజు వాయిదా గురించి ఒత్తిడి చేసారని గుసగుసలు వినిపించాయి. కానీ దీనిని దిల్ రాజు ఖండించారు. తాను ఎవరినీ ఒత్తిడి చేయలేదని, ఆలోచించాలని సూచించానని సలహాలు ఇచ్చానని దిల్ రాజు చెబుతున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద సినిమాలు విడుదలవుతున్నాయ. వాటితో పోటీపడి చిన్న సినిమాలు నిలదొక్కుకుంటాయా? అన్నది సందిగ్ధం. అదే సమయంలో కంటెంట్ పై నమ్మకంతోనే ప్రశాంత్ వర్మ లాంటి దర్శకులు సాహసం చేస్తున్నారని భావించాలి.