Dil Raju : దిల్ రాజుకు శంకర్ మీద నమ్మకం లేదా? అందుకే అలా చేస్తున్నాడా!
ఇక సంక్రాంతి, దసరా, సమ్మర్ సీజన్లలో సినిమాల విడుదల తేదీలను సైతం దిల్ రాజు డిసైడ్ చేస్తున్నాడనే విమర్శలు ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాల నిర్మాణ సమయంలో డిస్ట్రిబ్యూషన్ రైట్స్ దిల్ రాజు తీసుకుంటున్నది. దీంతో తానే సినిమా విడుదల తేదీలను నిర్ణయిస్తున్నాడని, చిన్న సినిమాలతో పాటు కొన్ని పెద్ద సినిమాలకు సైతం దసరా, సంక్రాంతి సీజన్ లో అవకాశం ఇవ్వడం లేదని కొందరు నిర్మాతలు బాహాటంగానే ఆరోపణలు వచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా, అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో సినిమాను అల్లు అరవింద్, ఎస్ రాధాకృష్ణ నిర్మించారు. ఈ రెండు సినిమాలు 2020 సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే మెజార్టీ థియేటర్లు మహేష్ బాబు సినిమాకే ఇచ్చుకున్నాడనే అపవాదును మూటగట్టుకున్నాడు.
సినిమా ఏదైనా తనే మాటే చెల్లుతుందనే దిల్ రాజు ఇప్పుడు తన సినిమాల విడుదల సమయంలో భయపడిపోతున్నాడట. కొన్ని సినిమాల ఫలితాలను దిల్ రాజు ముందే ఊహిస్తుంటాడు. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో తానే స్వయంగా చెప్పాడు కూడా. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ చేంజర్ విషయంలో కాస్త భయపడుతున్నాడని టాక్. ఈ సంక్రాంతిని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరో సినిమాకు అవకాశం లేకుండా తన బ్యానర్ నుంచే రెండు సినిమాలను విడుదల చేసేందుకు డిసైడ్ అయ్యాడట. భారతీయుడు-2 సినిమా రిజల్ట్ ప్రభావం గేమ్ చేంజర్ మీద ఉంటుందని దిల్ రాజు సైతం నమ్ముతున్నాడట. అందుకే ఈ సంక్రాంతికి వెంకటేష్ సినిమాను కూడా రిలీజ్ చేస్తున్నాడట. గేమ్ చేంజర్ ఆడకపోయినా వెంకటేష్ సినిమాతో నష్టాలను పూడ్చుకోవచ్చని భావిస్తున్నాడట.