Mega Family : మెగా ఫ్యామిలీతో విభేదాలు.. బన్నీ పోస్టుతో క్లారిటీ వచ్చినట్లేనా?
Mega Family : కొంత కాలంగా మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాల మధ్య విభేదాలు పొడచూపినట్లు రూమర్లు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆజ్యం పోస్తూ మెగా మేనల్లుగు సాయిధరమ్ తేజ్, మెగా డాటర్ నిహారిక అల్లు అర్జున్ ను సోషల్ మీడియా లో అన్ ఫాలో చేయడంతో పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.
ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరింత తారాస్థాయికి చేరుకున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువైంది. అల్లు అర్జున్, జనసేనను విస్మరించి వైసీపీ పార్టీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడమే ఈ రెండు కుటుంబాల మధ్య దూరానికి కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
అల్లు అర్జున్ తమను విభేదించినా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి, ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యలు చేపట్టారు. అయితే పవన్ తన అధికారాన్ని పరోక్షంగా అల్లు అర్జున్ పై ఉపయోగిస్తున్నారని పుకార్లు మరింత ఎక్కువయ్యాయి.
ఇటీవల మెగా డాటర్ నిహారిక కమిటీ కుర్రోళ్ళు సినిమాను ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు. కానీ బన్నీ మాత్రం నిహారిక సినిమాని పట్టించుకోకుండా ఎన్టీఆర్ బావ మరిది నితిన్ నటించిన ఆయ్ సినిమాను తన సోషల్ మీడియా వేదికగా ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. మెగా కుటుంబంతో మళ్లీ కలిసిపోవాలనుకుంటే తప్పకుండా నిహారిక సినిమాని కూడా బన్నీ ప్రమోట్ చేసేవాడని, ఆయ్ సినిమాని ప్రమోట్ చేయడం మెగా ఫ్యామిలీకి దూరంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నది. నిజంగా బన్నీ పోస్ట్ తో క్లారిటీ వచ్చిందా అనేది మాత్రం సోషల్ మీడియా ప్రచారమే అని అనకుంటున్నారు.