JAISW News Telugu

KTR : వాళ్ల కోసం పాలసీలు మార్చలేదా: బీజేపీపై కేటీఆర్ ఫైర్

KTR

KTR 

KTR : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాటల తూటలు పేలుతున్నాయి. మూడు పార్టీల భవిష్యత్ ను తేల్చే ఎన్నికలు కావడంతో నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్ దేశంలో అనేక పాలసీలు మారినట్లు గుర్తు చేశారు.

అదానీ కోసం బొగ్గు పాలసీ, విమానయాన పాలసీ మార్చింది వాస్తవం కదా? అని ప్రశ్నించిన కేటీఆర్ వాళ్ల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారన్నారు. రెండేళ్లుగా ఢిల్లీ లిక్కర్ పాలసీపై విచారణ జరుపుతున్నా ఒక్క రూపాయి అయిన దర్యాప్తు సంస్థలు రికవరీ చేశాయా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఊహజనిత కథలతో అల్లిన స్టోరే ఎక్సైజ్ పాలసీ కేసు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రాంతీయ పార్టీలు ఉన్నచోట బీజేపీ మనుగడ కష్టమని భావించే కుట్రపూరితంగా ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుందని ఆరోపించారు.

పలు కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్న కేటీఆర్ దర్యాప్తు సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయ వ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉందని తప్పకుండా న్యాయం గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version