Voter Slip : తెలంగాణలో ఎన్నికల సంరంభం చివరి అంకానికి చేరింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పులు అందజేశారు. ఇంకా ఓటరు స్లిప్పులు రాని వారు ఉంటే వారు కూడా ఓటు వేయవచ్చు. ఓటు ఎలా వేయాలి? ఏం తీసుకెళ్లాలి? అనే విషయాలు తెలుసుకుని ఓటు వేయడం మంచిదని చెబుతున్నారు.
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి ఓట్లు తమకే దక్కాలని తంటాలు పడుతున్నాయి. హామీల వర్షంలో ముంచెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఓటరు స్లిప్పులు పంపిణీ చేసింది.
ఓటరు జాబితాలో పేరు లేకున్నా ఓటు వేయవచ్చు. 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది ఉన్నా దాన్ని చూపించి ఓటు వేయవచ్చు. ఆధార్ కార్డు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్, పాన్ కార్డ్ తదితర రకాల్లో ఏది ఉన్నా మనం ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ఇలా మనకు ఓటరు స్లిప్పు రాలేదని నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
మనకు స్లిప్పు రాకపోతే ఎన్నికల వెబ్ సైట్ లోకి వెళ్లి ఓటరు వివరాలు, సీరియల్ నెంబర్, పోలింగ్ కేంద్రం, పోలింగ్ సమయం, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలు కనిపిస్తాయి. ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్ నెంబర్ సాయంతో ఓటు వేయడానికి వెళ్లే వారు తమతో పాటు గుర్తింపు కార్డు లేకపోతే ఇతర కార్డు ఏదైనా తీసుకెళ్లవచ్చు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. తరువాత ఓటరు కార్డు పై క్యూర్ కోడ్ ను స్కాన్ చేయాలి. గుర్తింపు కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.