KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన రెండో రోజే బాత్ రూంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్నారు. గజ్వేల్ నుంచి మూడు పర్యాయాలు కేసీఆర్ విజయం సాధించడం విశేషం. కర్ర సాయంతో నడవగలుగుతున్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా గెలిచాక అయ్యారు.
ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలందరిని ఆహ్వానించారు. శాసనసభ్యుడిగా ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీ అవుతున్నారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కు రాసిన లేఖలో కేసీఆర్ శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమంలో కలిసి రావాలని కోరడం గమనార్హం. ఇలా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పంపారు.
పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో వ్యవహరించబోయే వ్యూహాలపై దిశా నిర్దేశం చేశారు. కేసీఆర్ అధికారికంగా రేపు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంచేసే సందర్భంలో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. నాయకులు, ప్రజలతో మమేకం కావాలని ప్రయత్నిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల కోసం రాష్ట్రమంతా పర్యటించాలని వ్యూహం ఖరారు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ ను ఎదుర్కొని పోటీలో నిలవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆ రెండు పార్టీలను ఎదుర్కొని బీఆర్ఎస్ సభ్యులు విజయం సాధించేలా చూడాలని ఆశిస్తున్నారు. దీని కోసం పలు సరికొత్త వ్యూహాలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.