Rashmika Dress : సంక్రాంతి పండుగకి రష్మిక ధరించిన ఈ డ్రెస్ ధరతో ఒక ఇల్లు కట్టేయొచ్చు తెలుసా!
Rashmika Dress : కన్నడ సినీ పరిశ్రమలో అడుగుపెట్టి తొలిసినిమాతోనే సూపర్ హిట్ ని అందుకున్న రష్మిక మందన, ఆ తర్వాత టాలీవుడ్ లో ‘ఛలో’ చిత్రం ద్వారా తెలుగు ఆడియన్స్ కి పరిచయమై మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టింది. కన్నడ సినీ పరిశ్రమ ఇవ్వని ఫేమ్, క్రేజ్,ఫాలోయింగ్ ఆమెకి తెలుగు సినీ పరిశ్రమ ఇచ్చింది. ‘ఛలో’ తర్వాత ఆమె హీరోయిన్ గా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.
ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ, అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడంటే ఆమె బాలీవుడ్ లో ‘ఎనిమల్’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అక్కడి ఆడియన్స్ కి బాగా దగ్గరైంది కానీ, ఈ సినిమా కి ముందే ఆమె నేషనల్ క్రష్ గా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది.
అప్పటి నుండి రష్మిక ఏమి చేసినా అది సెన్సేషన్ అయిపోతుంది. ముఖ్యంగా ఆమె ధరించే దుస్తులు, వేసుకునే ఆభరణాలను తాము కూడా కొనుగోలు చెయ్యాలని అభిమానులు తెగ సంబరపడిపోతూ ఉన్నారు. రీసెంట్ గా సంక్రాంతి సందర్భంగా ఆమె వేసుకున్న డ్రెస్ పై అభిమానుల కన్ను పడింది. ఈ చీర ఎంత బాగుందో, ఇందులో రష్మిక ఎంత అందంగా ఉందో అంటూ పొగడ్తలతో రష్మిక కి దిష్టి పెట్టేసారు. ఈ డ్రెస్ ని రష్మిక ప్రత్యేకంగా తన డిజైనర్ల చేత చేయించుకుందట. దీని ఖరీదు సుమారుగా నాలుగు లక్షల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. అంత డబ్బులు మనలాంటి మిడిల్ క్లాస్ మనుషులకు ఉంటే, మనకి తోచినంతలో చిన్న ఇల్లు ని కట్టుకునే వాళ్ళం, లేదా తక్కువలో ఏదైనా కారుని,లేకపోతే నగలుని కొనుగోలు చేసేవాళ్ళం. సెలెబ్రిటీలు ధరించే వస్త్రాభరణాలు అన్నీ ఇంత రేట్ లో ఉంటాయి.
కాబట్టి అది మనం చూడడమే తప్ప, కొనుగోలు చేయలేము. ఇకపోతే రష్మిక ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ‘పుష్ప : ది రూల్’ చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత ఆమె తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మించే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించబోతుంది. కెరీర్ లో మొట్టమొదటిసారి రష్మిక చెయ్యబోతున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత పలు స్క్రిప్ట్స్ విన్నది అట కానీ, నటనకి ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే ఇక నుండి చేస్తుందట.