Diabetes Controlled : ప్రస్తుత రోజుల్లో చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే మధుమేహానికి లోనవుతున్నారు. దీంతో జీవితాంతం మందులు వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో మనకు చాలా రకాల నష్టాలు ఉంటాయి. అందుకే షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవడమే శ్రేయస్కరమని గుర్తించుకుని ఆ దిశగా నడుచుకోవడం అలవాటుగా చేసుకోవాలి.
డిన్నర్ ఒకే సమయానికి..
రోజు రాత్రి చేసే భోజనం ఒకే సమయంలో చేసేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం కూడా త్వరగా జీర్ణమవుతుంది. రాత్రి పూట చేసే భోజనం లైట్ గా ఉండాలి. బాగా తిని ఆపసోపాలు పడకుండా కాస్త తగ్గించుకుని తినడం వల్ల పొట్ట సులువుగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా అనిపిస్తుంది.
భోజనం తరువాత నడక
రాత్రి భోజనం చేశాక ఓ గంట పాటు నడక సాగించడం ఉత్తమం. దీని వల్ల మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఫలితంగా పొట్ట ఖాళీగా అవుతుంది. దీంతో మంచి నిద్ర పట్టే వీలుంటుంది. ఇవి మనకు ఆరో గ్యాన్ని ఇచ్చే ఫలితాలుగా గుర్తించాలి. ఇలా చేయడం మనకు చాలా రకాల ప్రయోజనాలు కలిగిస్తుంది.
ఉదయం వాకింగ్
ఉదయం సమయంలో కూడా వాకింగ్ ఎంతో సురక్షితం. ఇది ఔషధంలా పనిచేస్తుంది. రోజు ఉదయం ఓ గంట పాటు వాకింగ్ చేస్తే షుగర్ లెవల్స్ తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల మధుమేహం చాలా కంట్రోల్ లో ఉంటుంది. దీని అవసరాన్ని గుర్తించి మనం వాకింగ్ చేసేందుకు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేయడం మనకు ఎంతో మేలని తెలుసుకోవాలి.