YS Sharmila : ప్రత్యేక హోదా కోసం పోరాడారా.?: వైఎస్ షర్మిల

YS Sharmila

YS Sharmila

YS Sharmila : రాష్ట్రానిక ప్రత్యేక హోదా కోసం వైసీపీ నేతలు పోరాడారా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి  ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని, మోదీని నిలదీసే ధైర్యం రాష్ట్ర ప్రభుత్వ నేతలకు లేదని విమర్శించారు. చక్కెర పరిశ్రమలు మూతపడితే వాటిని తెరిపించాలనే ఆలోచన కూడా పాలకులకు లేదన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు.

‘‘అధికారంలోకి వచ్చాక జగన్ ప్రత్యేక హోదా కోసం ఒక్క ఉద్యమమైనా చేశారా..? రాజధాని కట్టగలిగారా..? రాజధాని కూడా కట్టలేని నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి..? రైతులకు అన్యాయం జరుగుతుంటే సీఎం ఏం చేస్తున్నారు..? మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ ఇచ్చారు. ఎన్నికలకు 2 నెలల సమయం ఉందన్నప్పుడే గుర్తొచ్చిందా..?  కుంభకర్ణుడు ఆరు నెలలే నిద్రపోతాడు. మీరు ఐదేళ్లు నిద్రపోయి ఎన్నికలప్పుడు లేచారా..?  సిద్ధమంటూ బయల్దేరారు. దేనికి అప్పులు చేయడానికా..? మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లే అడగనన్నారు. ఇప్పుడు సర్కారే లిక్కర్ అమ్ముతోంది. నాసిరకం మద్యం తాగి ప్రజలు చనిపోతున్నారు’’ అని ఎన్నికల ప్రచారంలో షర్మిల మండిపడ్డారు.

TAGS