JAISW News Telugu

YCP Votes : టీడీపీ కంటే వైసీపీకి 2 శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయా?

YCP Votes

YCP Votes

YCP Votes : ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదేళ్ల తర్వాత చారిత్రకమైన తీర్పు ఇచ్చారు. 2019లో టీడీపీని 23కు పరిమితం చేయగా.. ఇప్పుడు వైసీపీని 11కే పరిమితం చేశారు. జగన్ కు ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉందని ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తోంది. తప్పులపై పోస్ట్ మార్టం నిర్వహించుకొని మరో సారి జరగకుండా చూసుకుంటూ ప్రజల మధ్య ఉండాలని పలువురు జగన్ కు సూచనలు చేస్తున్నారు.

అయితే, ప్రజా తీర్పును కించపరిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతుదారులు అన్ని రకాల కుయుక్తులు పన్నుతున్నారు. జగన్ ఓటమికి కుట్ర జరిగిందని, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని మాట్లాడిన నేతలు ఇప్పుడు తాజాగా ఓట్ల శాతంలో ఏదో సర్ధి పుచ్చుకుంటున్నారు. ఈసీ వెబ్‌సైట్‌ కు సంబంధించి స్క్రీన్ షాట్లు తీసుకొని వాటితో టీడీపీ కంటే 2 శాతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు షేర్ పెరిగిందని తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు.

అసలు లెక్కలు..

ఈసీ లెక్కల ప్రకారం టీడీపీకి 45.60 శాతం ఓట్లు రాగా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 39.37 శాతం మాత్రమే ఓట్ షేరింగ్ వచ్చింది. ఇందులో మరో విషయం ఏంటంటే, టీడీపీ 144 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓట్ షేర్ 175 స్థానాలది తీసుకుంది. ఓటమిపై జగన్ మరింత హుందాగా వ్యవహరించాల్సి ఉంది. EVMలను నిందించడం లేదంటే కుట్రలను ఆరోపించడం బాధ్యతా రాహిత్యం. ఇది ప్రజల తీర్పును కించపరచడం తప్ప మరొకటి కాదు.

ఇదిలా ఉంటే ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పునరాగమనం చాలా కష్టం. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కేవలం 11 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. రానున్న రోజులు జగన్ కు మరింత గడ్డు కాలంగా అనిపిస్తోంది.

వైసీపీ లాగానే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జరిగింది. తెలంగాణలో మొత్తం 119 స్థానాలకు గానూ బీఆర్ఎస్ 39 సీట్లు గెలుచుకొని కనీసం ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. కానీ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కేసీఆర్ తో పోల్చుకుంటే జగన్ 11 సీట్లతో మరింత దిగజారిపోయారు. 

Exit mobile version