Indra : మెగాస్టార్ ‘ఇంద్ర’కు ఇద్దరు డైరెక్టర్లు పని చేశారా? ఆ సెకండ్ డైరెక్టర్ గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Indra : మెగాస్టార్ చిరంజీవి రీసెంట్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్ లో ఉంది. దీంతో రేపు మెగాస్టార్ పుట్టినరోజు సందర్బంగా రిలీజ్ కు మూవీ లేదు. దీంతో స్టార్ బ్యానర్ నిర్మాత అశ్వినీదత్ తన బ్యానర్ వైజయంతి మూవీస్ లో వచ్చిన ‘ఇంద్ర’ను రీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్లు తెలిసిందే. ఇక అన్నగారి సినిమా అంటే ఆగుడు ఎవరితరం.. చిరంజీవి, మెగా ఫ్యాన్స్ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రూ. 2 కోట్ల వరకు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో వచ్చింది. సీనియర్ హీరోల కేటగిరిలో ఇదొక ఆల్ టైం రికార్డనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. లండన్, ఆస్ట్రేలియాల్లో కూడా ఇంద్ర కు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి.
ఇప్పటి వరకు ‘ఇంద్ర’ గురించి ఎవరికీ తెలియని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మూవీకి డైరెక్టర్ గా బీ గోపాల్ వ్యవహరించాడని తెలుసుకదా.. అయితే ఆయనతో పాటు మరో మరో స్టార్ హీరో కూడా డైరెక్షన్ లో భాగం అయ్యారట. ఆయన ఎవరో కాదు.. మన బాసే మెగాస్టార్. ఇంద్ర షూటింగ్ సమయంలోనే గోపాల్ మరో సినిమా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ‘అల్లరి రాముడు’ చేస్తున్నాడు. ఈ రెండు వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. అంటే రెండింటి షూటింగ్ అటు ఇటుగా సమానంగా సాగింది. దీంతో రెండు ప్రాజెక్టుల్లో పని చేయడం గోపాల్ కు కష్టంగా మారింది. ఆ సమయంలో 50 శాతానికి పైగా సినిమాకు చిరంజీవినే దర్శకత్వం వహించారట. దర్శకుడి కుర్చీలో కూర్చొని మరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మతో ఒక సాంగ్ ‘భం భం భోళే’ సాంగ్ సైతం కంపోజ్ చేయించారట.
ఫస్ట్ హాఫ్ కు చిరంజీవి దర్శకత్వం వహించాడని ఇండస్ట్రీ టాక్ వినిపించింది. క్లైమాక్స్ కూడా ఆయన పర్యవేక్షణలోనే జరిగిందట. ఇది విన్న ఫ్యాన్స్ బాస్ లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడని బాస్ ఈజ్ గ్రేట్ అని అంటున్నారు. మరి అదీ మెగాస్టార్ అంటే.. రేపటితో (ఆగస్ట్ 22) ఆయన 69 వ పడిలోకి అడుగుపెడుతున్నారు. గతంలో ఒక ఇంటర్వ్యూ తనకు దర్శకత్వంపై మక్కువ గురించి చెప్పారు. 70 ఏళ్లు వచ్చిన తర్వాత ఒక సినిమాకు పూర్తి స్థాయిలో దర్శకత్వం వహిస్తానని ఇదే తన కోరిక అంటూ చెప్పారు. వచ్చే ఏడాది మనం మెగాస్టార్ డైరెక్షన్ లో సినిమా చూడబోతున్నామన్నమాట.