JAISW News Telugu

Game Changer : శంకర్ లేని సమయం లో ‘గేమ్ చేంజర్’ కి ఆ స్టార్ డైరెక్టర్ దర్శకత్వం వహించాడా?

FacebookXLinkedinWhatsapp
Game Changer

Ram charan Game Changer

Game Changer : #RRR వంటి పాన్ వరల్డ్ సెన్సేషన్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో ‘గేమ్ చేంజర్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. #RRR సినిమా షూటింగ్ అయిపోగానే మొదలైన ఈ సినిమా ఇంకా పూర్తి అవ్వలేదు. మొదట్లో మంచి వేగంగానే సినిమా షూట్ జరిగింది కానీ, మధ్యలో శంకర్ ఇండియన్ 2 చిత్రాన్ని ఎట్టి పరిస్థితిలో పూర్తి చెయ్యాలనే డిమాండ్ వచ్చింది.

దాంతో ఆయన నెలలో 15 రోజుల షూటింగ్ ఇండియన్ 2 కి కేటాయిస్తే, మరో 15 రోజుల షూటింగ్ గేమ్ చేంజర్ కి కేటాయించాడు. అందుకే ఈ సినిమా ఇంత ఆలస్యం అయ్యింది. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గానే మొదలైంది. ఈసారి షెడ్యూల్ ఒక సాంగ్ తో ప్రారంభం అయ్యింది. శంకర్ సినిమాల్లో పాటలు ఎంత రిచ్ గా ఉంటాయో మన అందరికీ తెలిసిందే, ఈ సినిమాలో కూడా అంతే రిచ్ గా ఉండబోతున్నాయి.

చాలా రోజుల క్రితం ఈ చిత్రం నుండి ‘జరగండి..జరగండి’ అనే పాటని విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ఒక పోస్టర్ ద్వారా తెలియచేసారు. కానీ ఇప్పటి వరకు ఆ పాట ఆచూకీ కనపడలేదు. కనీసం సంక్రాంతి కానుకగా అయినా విడుదల చేస్తారా అంటే అది కూడా లేదట. ఇలా ప్రతీ అప్డేట్ లేట్ చేస్తూ రావడం వల్ల ఈ సినిమాకి మొదట్లో ఉన్న హైప్ ఇప్పుడు లేదు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ విషయం లో ఇండస్ట్రీ లో ఎన్నో రూమర్స్ ఉన్నాయి. శంకర్ ఇండియన్ 2 షూటింగ్ కి వెళ్ళినప్పుడు, దిల్ రాజు ‘గేమ్ చేంజర్’ కి సంబంధించిన కొన్ని రషెస్ ని చూసాడు. ఈ రషెస్ లో కొన్ని షాట్స్ ఆయనకీ సంతృప్తి ని ఇవ్వలేదట. దీంతో ఆయనలేని సమయం లో కొన్ని సన్నివేశాలను దిల్ రాజు ‘హిట్’ సిరీస్ దర్శకుడు శైలేష్ తో రీ షూట్స్ చేయించాడట.

ఈ విషయం శంకర్ కి కూడా తెలియకుండా ఉంచాడట. ఎందుకంటే శంకర్ కి ఇలాంటివి అసలు నచ్చవు. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు ప్రతీ విషయం ఆయన చేతులు మీదనే జరగాలి. సాంగ్ షూటింగ్స్ లో మామూలుగా డైరెక్టర్స్ ఒక్కోసారి ఉండరు, కానీ శంకర్ మాత్రం కచ్చితంగా ఉంటాడట. అందుకే ఈ విషయం గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. కానీ నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే, అది తెలిసిన రోజు శంకర్ నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.

Exit mobile version